యాదాద్రిలో భారీ ఎత్తున సుదర్శన యాగం

యాదగిరి గుట్ట దేవాలయ పుననిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చేదిద్దేపనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ యాగ నిర్వహణకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. యాదాద్రిలో వంద ఎకరాల యజ్ఞవాటికలో 1048 యజ్ఞ కుండాలతో యాగం నిర్వహించాలని నిర్ణయించారు. మూడు వేల మంది రుత్వికులు, మరో 3వేల మంది సహాయకులతో మహా యాగాన్ని గొప్పగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలను, భద్రినాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి వంటి మహాక్షేత్రాల నుంచి మఠాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను, మంత్రులను, మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసే అంశంపై జీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు.
కిడ్నాప్ కు గురైన సోనీ క్షేమం-నిందితుడి అరెస్ట్