కృష్ణా జిల్లా లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ భయానక వాతావరణం నెలకొంది. జిల్లాలోని పెనమలూరులో రెండు వర్గాలకు మద్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ భయానక వాతావరణం సృష్టించారు. పెనమలూరు పోలీస్ ష్టేషన్ ఎదురుగానే ఈ ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. రాళ్లదాడులకు భయపడి పోలీసులు సైతం స్టేషన్ లోపలికి పరుగులు తీశారు.
పెనమలూరులోని ఓ ప్రైవేటు హాస్టల్ కు చెందిన విద్యార్థులు రెండుగా విడిపోయి పరస్పరం దాడులకు చేసుకున్నారు. హాస్టల్ లో ఉంటున్న ఒక విద్యార్థి తాను చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు సదరు విద్యార్థిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. దీనితో ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఓ మంత్రి అండతో పోలీసులు కేసును నమోదు చేయలేదని బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అతనికి మద్దతుగా కొంత మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆదోంళనకు దిగడంతో ఇటు హాస్టల్ నిర్వాహకులకు మద్దతుగా మరికొంత మంది విద్యార్తులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది. సమీపంలోని ఇళ్లలోని ప్రజలకు పరుగులు తీశారు.
ఈ దాడుల్లో నలుగురు విద్యార్థులకు తలలు పలగ్గా మరికొంత మందికి గాయాలయ్యాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తరలించారు. ఎవరు చట్టాన్ని అతిక్రమించిన తీవ్ర చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.