ssc results | పదవ తరగతి పరీక్షా ఫలితాలు

0
120
ssc results
telangana 10th class students

ssc results తెలంగాణలో పదోతరగతి ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో.. పదోతరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు. అదే విధంగా పాఠశాల హెడ్‌మాస్టర్లకు కూడా ఫలితాలను పంపనున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే.. మే మూడోవారంలో పదోతరగతి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి రోజున ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ అందరూ వారివారి పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది.




ssc results తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి పరీక్షా ఫలితాలు 2018 సంవత్సరం 83.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పదవతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. 85.14 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా బాలురుల్లో ఇది 82.46 శాతం గా ఉంది. telangana ssc results
పదవ తరగతి ఫలితాలలో జగత్యాలు సత్తా సాటింది. రాష్ట్రం మొత్తంమీద ఈ జిల్లాకు చెందిన వారు ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఆదిలాబాద్ ఆఖరి స్థానంలో ఉంది. ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షలకు దాదాపు ఐదు లక్షలా ముప్పైవేల మంది హాజరయ్యారు. తెలంగాణలోని 2125 పాఠశాలలు నూరు శాతం ఫలితాలను సాధించాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం చూడండి…

Wanna Share it with loved ones?