భద్రాచలంలో శ్రీరామ మాహపట్టభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. నవమి నాడు సీతారాముల పెళ్లి జరగ్గా నేడు వేద మంత్ర ఘోషల మధ్య శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ. నరసింహన్ తో పాటుగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ కార్యక్రమం జరిగిన స్టేడియంలోనే ఈ పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. శ్రీరామ చంద్రుని గుణగణాలతో పాటుగా శ్రీరామ రాజ్యం వైభవాన్ని వేదపండితులు వివరించారు. పట్టభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే చేస్తారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత ప్రాశత్యంగా భావిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా భద్రాచల దేవాస్థానం అన్ని ఏర్పాట్లను చేసింది. ( Srirama navami celebrations )
శ్రీరాముడు-హనుమ స్నేహితులా…
rama