చిన జీయర్ స్వామిపైనే విమర్శలా..!

0
58

చిన జీయర్ స్వామి శంషాబాద్ లోని తన ఆశ్రమంలో ప్రతిష్టించనున్న 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం పై బాలల హక్కుల సంఘం పేర అత్యతరావు చేసిన విమర్శలను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తులసీ శ్రీనివాస్, వక్కలంక శ్రీనివాస్ లు తీవ్రంగా ఖండించారు. అత్యతరావుకు చిన జీయర్ స్వామిని అనేంత స్థాయిలేదని వారు విరుచుకుని పడ్డారు. ఇంకా వారు ఏమన్నారంటే…
“చిన జీయర్ స్వామి పై కొంత మంది చేస్తున్న విమర్శలు దారుణంగా ఉన్నాయి. శంషాబాద్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నిర్మించతలపెట్టిన 216 అడుగల రామానుజాచార్యుల విగ్రహం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఎటువంటి సహేతుక కారణాలు కనిపించడం లేదు. బాలల హక్కుల సంఘం పేరిట చిన జీయర్ స్వామిపై చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితంగా ఉన్నాయి. వేయి కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టించనున్న రామానుచార్యుల విగ్రహం వల్ల బాలల హక్కులకు వచ్చిన భంగం ఏమిటో అర్థం కావడం లేదు. విగ్రహాలను నెలకొల్పడం వల్ల ధనం వృద్ధా అవుతోందని ఇదే డబ్బును బాలల కోసం వినియోగించాలనే హక్కుల సంఘానికి చెందిన అత్యతరావు వాదనలో ఎటువంటి పసా లేదు. జీయర్ స్వామికి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడివి అంటూ విమర్శించడం పూర్తిగా అర్థ రహితంగా కనిపిస్తోంది.
విగ్రహ ప్రతిష్ట వృద్ధా వ్యయం అంటుూ చేస్తున్న విమర్శకులలకు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ సమాజీక కార్యక్రమాలు కనిపించడం లేదా..? చిన జీయర్ టస్ట్ తరపున ఎన్నో అధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సామాజిక కార్యక్రమాలు కూడా నిరాకంటంగా నడుస్తున్నాయి. వైద్యశాల తో పాటుగా పాఠశాలలు కూడా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంగతి తెలియదా? అంధబాలల కోసం నిర్వహిస్తున్న పాఠశాల దేశంలోనే పెరుపొందిన విషయం వాళ్లకు తెలియదా..? పనిగట్టుకుని చియజీయర్ స్వామిపై విష ప్రచారం చేయడం బాధాకరం. దీనికి అత్యత రావు వెంటనే భేషరుతుగా క్షమాపణలు చెప్పాలి.”

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here