మహా పండితుడి పేరు తలవకుండా తెలుగు సభలా..!

ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. తెలుగు భాషపై ఉన్న మమకారంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్విహించిన ఈ బృహత్ కార్యంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఈ సభల్లో తెలులు భాష జౌన్నత్యానికి కృషిచేసిన పండితులు, భాషాభిమానుల ప్రస్తావన కనిపించకపోవడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోనే పెద్ద పండితుడిగా పేరుగాంచిన వ్యక్తులను స్మరించుకోకపోవడం సమంజసం కాదని శాస్త్రుల విశ్వనాథ శర్మ మనవడు శ్రీధర్ శర్మ శాస్త్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పండితుడు బహుభాషా కోవిదుడు, వేద పండితుడు,తెలుగు, సంస్కృతం,ఆయుర్వేదం,వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం లాంటి అనేక శాస్త్రాలలో అద్వితీయ ప్రావీణ్యం కల శాస్త్రుల విశ్వనాథ శర్మ ను పట్టించుకోకపోవడం పై విచారం వ్యక్తం చేశారు.చాగంటి కోటేశ్వర రావు, గరికపాటి,మల్లాది చంద్రశేఖర సిద్ధాంతి లాంటి మహా పండితులు సైతం లాంటి వాళ్ళు సైతం తమ గురుతువ్యులుగా భావించడంతో పాటుగా ఆయన స్థాయి పాండిత్యం తమకు లేదని వారు వినమ్రంగా చెప్పుకునే శర్మ లాంటి వారి ప్రస్తావన తెలుగు మహా సభల్లో కనిపించపోవడం దారుణమన్నారు.
సాక్షాత్తు భగవత్ స్వరూపులు జగద్గురవులు ఆది శంకరులచే స్థాపిత మూల పీఠమైన శృంగేరి శారదా పీఠాదీశ్వరులైన శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యారణ్య మహా స్వామి వారు, మరియు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహా స్వామి వారు సైతం తన స్వగృహములో 3 రోజుల పాటు విడిది చేసినటువంటి మహనీయుడు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పండితుడని తెలంగాణ లొనే కాకా ఇతర రాష్ట్రాలలో కూడా నేటికి వేద పాఠశాలలను నడుపుతున్న వారు గాని, వాటిలో అధ్యాపకులు గా వ్యవహరిస్తున్న వారు గాని, తెలుగు భాషా పండితులుగా స్థిరపడి వారు దేశానికి రాష్ట్రానికి సేవలను అందిస్తూ, భాషా మరియు సంస్కృతి ని కాపాడుతూ కీర్తి ని పొందుతున్నారంటే అది కేవలం శాస్త్రి గారి చలవ వల్లనే అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం లేదని శ్రీధర్ శర్మ చెప్పారు. అటువంటి వ్యక్తి తమ తాత గారైన శాస్త్రుల విశ్వనాథ శర్మ గురించి తెలుగు మహా సభలలో ప్రస్తావన లేకపోవటం అత్యంత బాధాకరమని డబ్బులు ఇచ్చి సన్మానం, సత్కారం చేయించుకునే స్వార్ధపు రోజులు ఇవన్నారు. అటువంటి ఈ రోజులలో ఆయన ఔన్నత్యాన్నీ ఆయన సేవలను రాష్ట్ర వ్యాప్తం చేసి ఆయన కీర్తిని నలు దిశలా చాటే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. తాను ఎవరిపైన కోపంతో గానీ ధ్వేషంతో కానీ ఇటువంటి ప్రకటనలు చేయడం లేదన్నారు. తాను చేసిన ప్రకటనలో ఏదైనా తప్పులుంటా పెద్దలు మన్నించాలని శ్రీధర్ శర్మ అన్నారు.