టీఆర్ఎస్ లోకి శ్రీధర్ బాబు?

0
79

సీనియర్ కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. మంథని నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీధర్ బాబు కు టీఆర్ఎస్ నుండి ఆహ్వానం అందినట్టు సమాచారం. వివాదరహితుడిగా, సమర్థుడిగా పేరున్న శ్రీధర్ బాబును టీఆర్ఎస్ లోకి ఆహ్వానించడంతో పాటుగా ఆయనకు పార్టీతోపాటుగా ప్రభుత్వంలోని సముచిత స్థానం ఇస్తామనే హామీకూడా టీఆర్ఎస్ నుండి అందినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన శ్రీధర్ బాబు మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరుతో పాటుగా ఎటువంటి అవినీతి మలికి లేని నేతగా ఆయనకు పేరుంది. గత ఎన్నికల్లో మంథని నుండి అనూహ్యంగా ఓటమిపాలైన శ్రీధర్ బాబు గత ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాష్ట్రంలోని కీలక నేతల్లో ఒకరిగా పేరుసంపాదించుకున్న ఆయన మంథని తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రీధర్ బాబుకు ఆహ్వానం అందించిందని దీనిపై ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇటీవల ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లిన సమయంలోనూ ఎమ్మెల్యేగా ఆ కార్యక్రమానికి హాజరైన శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీధర్ బాబు త్వరలోనే టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది.

Wanna Share it with loved ones?