వైభవంగా శ్రీ కరిగిరి వేంకటేశ్వర స్వామి రథోత్సవం

వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవాణ నక్షత్రం రోజున ఉప్పల్ స్వరూప్ నగర్ లోని శ్రీ కరిగిరి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో రథయాత్ర ఘనంగా జరిగింది. రథయాత్రను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో స్వామివారిని ఘనంగా ఊరేగించారు. దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. దేవస్థానం కమిటీ సభ్యులతో పాటుగా పెద్ద సంఖ్యలో భక్తులు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రవణా నక్షత్రం రోజున శ్రీ కరిగిరి వేంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం సందర్భంగా స్వామి రథోత్సవాన్ని జరిపినట్టు ఆలయ కమిటీ పేర్కొంది. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతున్నా శ్రీ కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. హనామాన్ జయంతిని పురస్కరించుకుని మే 10వ తేదీన 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని జరుపుతున్నట్టు వారు వివరించారు. ఉదయం 7.30 నుండి మద్యాహ్నం 12.30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీని తరువాత అన్న దాన కార్యక్రమం ఉంటుందన్నారు.
ఎటువంటి సంకటాలనైనా హరించే హనుమాన్ చాలీసా పారాయణం పుణ్యప్రదమని, దాన్ని చదవలేని వారు కనీసం విన్న అనంత పుణ్యఫలం లభిస్తుందని అర్చకస్వాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాల్సిందిగా ఆలయకమిటీ ప్రతినిధులు కోరారు.


uppal, swaroopnagar, swaroop nagar, sri karigiri venkateswara swami, venkateswara swami temple, venkateswara swami temple uppal.
వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య రహస్యాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనతాదళ్ సెక్యులర్ పాత్ర కీలకం – కర్ణాటలో హంగ్ ?


revanth-reddy-