సినీ నటి శ్రీదేవి మరణంపై పిటీషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు

దుబాయిలో చనిపోయిన ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై విచారణకు ఆదేశించాలని దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే శ్రీదేవి మరణానికి సంబంధించి అటు దుబాయి పోలీసులు, ఇటు భారత అధికారులు విచారణ జరిపినందున దీనిపై తిరిగి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినీ నటి శ్రీదేవి మరణంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాత సునీల్ సింగ్ వేసిన పిటీషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కోర్టులో వేసిన పిటీషన్ వేసిన సునీల్ సింగ్ పలు విషయాలను కోర్టు ముందుకు తీసుకునివచ్చి తన వాదనలను వినిపించారు.
సినీ నటి శ్రీదేవి ది సహజమరణం కాదని పిటీషనర్ పిటీషినర్ తరుపన వాదించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత సమయంలో ఇటువంటి పిటీషిన్ లను అనుమతించేది లేదని ఆ అవసరం ఉన్నట్టు భావించడం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
అరబ్ దేశం ఓమన్ లో శ్రీదేవి పేరిట రు.240 కోట్ల పాలసీ ఉందని ఆమె అరబ్ దేశాల్లో మరణిస్తేనే దీని తాలుకూ భీమా డబ్బు నామినీలకు అందుతుందని పిటీషనర్ పేర్కొంటూ ఈ అంశంలో తమకు అనుమానాలు ఉన్నాయని ఈ నిబంధన కారణంగానే శ్రీదేవి దుబాయ్ లో చనిపోయేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీదేవి బస చేసిన హోటల్ కు తాను, తన లాయర్ తో కలిసి సందర్శించినట్టు పిటీషనర్ సునీల్ సింగ్ చెప్పాడు. అక్కడ తనకు పలు అనుమానాస్పద అంశాలు కనిపించాయని చెప్పారు.
శ్రీదేవి ఎత్తు 5 అడుగులా 7 అంగుళాలు కాగా బాత్ టబ్ 5 అడుగులు మాత్రమే ఉందని ఆమె అందులో పడి మరణించడం అనేది అనుమానాలకు తావిచ్చేదిగా ఉందన్నారు. సృహ కోల్పోయిన తరువాత బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించినట్టుగా పోస్టుమార్టం రిపోర్టులు సైతం స్పష్టం చేశాయని దీనిపై విచారణ జరపాల్సిందిగా పిటీషన్ కోరాడు.
సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి ముందు సునీల్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అమె మృతిపై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం కోసం దీనిపై విచారణ జరిపించాల్దిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చుడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ విషయంలో విచారణ జరపాల్సిన అవసర లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసి పిటీషన్ ను తిరస్కరించింది.
సునీల్ సింగ్ తో పాటుగా గతంలో మరికొందరు కూడా సినీ నటి శ్రీదేవి మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. దుబాయిలోని ఓ హోటల్ లోని బాత్ టబ్ లో పడిపోయి శ్రీదేవి మరణించారు.
The Supreme Court, filmmaker, independent probe into the death of Bollywood actor Sridevi,
Chief Justice Dipak Misra, Sunil Singh , Dubai Police , Sridevi .

వీవీఐపీ బందోబస్తుల్లో పోలీసు సిబ్బంది ఆకలి కేకలు
Sridevi