ఏపీకీ ప్రత్యేక హోదా అవకాశమే లేదా…?

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రాకేజీ కావాలంటూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కేంద్రం పై ఒత్తిడి తీసుకుని వస్తుండడంతో పాటుగా దీన్ని ఆత్మగౌౌరవ సమస్యగా మారింది. రాజకీయ పక్షాలతో పాటుగా పలు సంఘాలు, ప్రజలు ప్రత్యేక ప్యాకేజీకోసం ఉధ్యమాలకు సన్నధం అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని దాని బదులుగా ప్రత్యేక ప్యాకేజీ వైపే ఆర్థిక శాఖ మొగ్గుచూపుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకీ అధికారులు స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.
ప్రత్యేక హోదా కింద దేశంలోనే అత్యంత వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలకు సమానంగా ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇస్తే దేశంలోని మరన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదాకోసం డిమాండ్ చేస్తాయని ఆర్థిక శాఖ అంచానా వేస్తోంది. ముఖ్యంగా బెంగాల్,బీహార్,యూపీ లాంటి వెనుకబడిన రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ ను వినిపిస్తాయని దీని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని భావిస్తున్న ఆర్థిక శాఖ ఇదే విషయాన్ని అరుణ్ జైట్లీకి కూడా వివరించినట్టు తెలుస్తోంది. ఏపీ గతంలో పోలవరం, రెవెన్యు లోటుకు సంబంధించి ఇచ్చిన నిధుల ఖర్చు విషయంలోనూ లెక్కలు చూపడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు చెప్పినట్టు సమాచారం. 12,500 కోట్ల రూపాయల మేరకు ఏపీ కేంద్రానికి లెక్కలు చెప్పాల్సి ఉందని వారు పేర్కొన్నారు.
అంధ్రప్రదేశ్ నిధులు అడుగుతున్న తీరుపై కూడా ఆర్థిక శాఖ అధికారులు కటువైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రక్షణ నిధులను సైతం తమకు కేటాయించాల్సిందిగా ఏపీ డిమాండ్ చేసేఅవకాసం ఉందని ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *