కిడ్నాప్ కు గురైన సోనీ క్షేమం-నిందితుడి అరెస్ట్

0
114
hayathnagar kidnap

sony kidnap హైదరాబాద్ హయత్ నగర్ లో కిడ్నాప్ గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూసీ లభించింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ సినీ ఫక్కీలో సోనిని కిడ్నాప్ చేసిన వ్యక్తి రవి శేఖర్ ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద విడిచిపెట్టాడు. నగరానికి చేరుకున్న సోనీకి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సోనినీ విడిచిపెట్టిన తరువాత రవిశేఖర్ తప్పించుకునే ప్రయత్నించినా పోలీసులు నిందితుడిని ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులుగా సోనీని ఎక్కడడెక్కడ తిప్పారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
సోనీ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న రోడ్డు పక్కన ఉన్న హోటల్ కు వచ్చిన నిందితుడు రవి శేఖర్ తనకు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని, సోనికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆమె తండ్రితో పాటుగా సోదరుడిని కారులో ఎక్కించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పిన తరువాత సోదరుడుని ఇంటికి వెళ్లమని పంపిన తరువాత సోనీ విద్యార్హత పత్రాలను జిరాక్స్ తీసుకుని రావాలంటూ సోనీ తండ్రిని కారు నుండి దింపిన తరువాత నిందితుడు సోనీతో సహా కారు ఉడాయించాడు. దారిలో తమకు ఇచ్చిన బిస్కట్ల వల్ల మగతగా ఉందని నిందితుడి తండ్రి చెప్తున్నాడు.
ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న పోలీసులు కిడ్నాప్ చేసింది రవి శేఖర్ గా గుర్తించారు. కృష్ణ జిల్లాకు చెందిన రవిపై గతంలో పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఉపయోగించిన కారును సైతం చోరీ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలింపులు జరిపానా పోలీసులకు చిక్కకుండా ముప్పతిప్పలు పెట్టిన నిందితుడు రవిశేఖర్ తాను కిడ్నాప్ చేసిన సోనీని మాత్రం అద్దంకిలో వదిలేసి పరారయ్యాడు. నిందితుడిని ఒంగోలు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవిశేఖర్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
వర్షాలు లేక, పంటలు పండక- దేశంలో కరవు పరిస్థితులు

Wanna Share it with loved ones?