ఆస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సోనియా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. విడిది కోసం సిమ్లా వచ్చిన సోనియా గాంధీకి అక్కడే కడుపునొప్పి తీవ్ర కావడంతో హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. సిమ్లాలో ప్రాథమిక చికిత్స తరువాత సోనియాను ఢిల్లీకి తరలించినట్టు సమాచారం. ఆరోగ్య సమస్యలతో గతంలోనూ సోనియా గాంధీ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందారు. 71 ఏళ్ల సోనియాను ఆస్పత్రిలోని వైద్యుల బృందం పరిశీలిస్తోందని ఆస్పత్రి చైర్మన్ డీఎస రానా తెలిపారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన పేర్కొన్నారు.