సోనియా గాంధీ ఆస్తి ఎంత?

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆస్తులు ఎన్ని? ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ వేత్తలో ఒకరా? సామాజిక మాధ్యమాల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోనియా గాంధీని అత్యంత ధవనంతురాలైన రాజకీయ నాయకురాలిగా పేర్కొంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో వాస్తువాలు ఎంత అనేదితేలాల్సిఉంది. సోనియా కు దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్నట్టు ఆ వార్తల్లో పేర్కొన్నారు. దీన్ని భారతీయ కరెన్సీలో లెక్కిస్తే సోనియా ఆస్తి దాదాపు 1లక్షా 36వేల కోట్ల రూపాయలు. ఈ లెక్కన సోనియా ఇంగ్లాండ్ రాణికన్నా ధనవంతురాలంటూ ఆ వార్తలు చెప్తున్నాయి. హఫింగ్ టన్ పోస్ట్ ( Huffington Post) అనే వెబ్ సైట్ ఈ వివరాలను వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సదరు సంస్థ సోనియా ఆస్తులను ఎట్లా లెక్కించింది అనే దానిపై సరైన వివరాలను అందించలేదు. తమకు ప్రజల నుండి అందిన వివరాలను బట్టి ఈ లెక్కలు గట్టినట్టుగా చెప్తున్న సదరు వివాదాస్పద సంస్థకు ఉన్న విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులకు సంబంధించిన వివరాలను అందచేసే ఫోర్బ్స్ సంస్థ కూడా ఎప్పుడూ సోనియా గాంధీకి సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. ఫోర్బ్స్ జాబితాలో కూడా ఎప్పుడూ సోనియా గాంధీ పేరు చోటుచేసుకోలేదు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ కు చెందిన హాఫింగ్ సన్ పోస్టు సోనియా తోపాటుగా అనేక మంది ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అయితే తాను అందచేసిన వివరాలు ప్రజల నుండి వచ్చిన సమాచారం తప్ప వాటికి ఎటువంటి చట్టబద్దతా లేదని సదరు సంస్థ ప్రకటించుకుంది. ఈ వెబ్ సైట్ పై గతంలోనూ అనేక విమర్శలు వచ్చాయి. చాలా మంది ప్రముఖులకు సంబంధించి ఆస్తుల వివరాలను వెల్లడించే క్రమంలో తప్పుడు తడకల వివరాలను అందచేసిందని సదరు సంస్థపై కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించారు.
సోనియా గాంధీ ఆస్తులకు సంబంధించిన ఆస్తులపై బిజినెస్ ఇన్ సైడర్ రాసిన కథనం కూడా వివాదాస్పదం అయింది. ఈ కథనంలో సోనియా గాంధీని నాల్గవ ధవంతురాలైన రాజకీయవేత్తగా పేర్కొనడంపై కూడా విమర్శలు వచ్చాయి. భారత్ కు చెందిన జాతీయ ఎన్నికల నిఘా సంస్థ కూడా సోనియా గాంధీకి లక్షలకోట్ల ఆస్తులు ఉన్నట్టు వచ్చిన వార్తలను ఖండించింది. సోనియా గాంధీ రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తూ వెల్లడించిన ఆస్తుల ప్రకారం అమకు తన పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో భాగంగా ఇటలీలో ఉన్న ఇంట విలువను
6.7 కోట్లుగా చెప్పారు. ఇవి కాకుండా 39 లక్షల రూపాయల విలువైన బంగారం, 23 లక్షల విలువై అభరాణాలు ఉన్నట్టు అఫెడవిట్ లో పేర్కొన్నారు. 85 లక్షల రూపాయల నగదు, మరో 66 లక్షల రూపాయల ఎఫ్ డీలు ఉన్నట్టు వెల్లడించారు.
సోనియా ఆస్తులకు సంబంధించి చాలా రోజుల నుండి అనేక వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. సోనియాకు పెద్ద సంఖ్యలో స్విస్ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయనే వార్తలు గుప్పుమన్నాయి. వీటికి తోడు విదశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ ఆస్తులను కూడగట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. సోనియా గాంధీ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడగట్టుకున్నారని కొంత మంది వాదిస్తుండగా ఇవన్నీ గాలి వార్తలని బీజేపీ పనిగట్టుకుని ఇటువంటి గాలి వార్తలను ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు వాదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *