ఎమ్మెల్యే శోభతో వెకిలి వేషాలు

అమె ఎమ్మెల్యే, లక్షలాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి. ఈమెకు కూడా వెకిలి చేష్టాల బెదడ తప్పలేదు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కిష్టాపూర్ వద్ద జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే శోభ రామడుగు మండలంలో పర్యటించి కరీంనగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు అత్యంత సమీపంలోకి రావడమే కాకుండా అమెను చూసి అసభ్యకరమైన  సైగలు చేశారు. వీరి ఆగడాలు కొంత సేపు ఎమ్మెల్యే తేలికగా తీసుకున్నా వారు మరీ సృతిమించడంతో కాన్వాయ్ లోని ఎమ్మెల్యే అనుచరులు యువకులు ప్రయాణిస్తున్న బైక్ ను అడ్డుకున్నారు. వారి చేష్టలు తెలుసుకున్న స్థానికులు, గన్ మెన్ వారికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముగ్గురు యువకులు పూర్తిగా మధ్యం మత్తులో ఉన్నారు. వీరిని కరీంనగర్ కొత్తపల్లి కి చెందిన యువకులు అజయ్, రాజు, జితేందర్ లు గుర్తించారు. వీరిని అరెస్టు చేసిన పోలీసలు స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే వాహనంలో ఉందని తెలిసీ వారు ఈ విధంగా వెకిలి వేషాలు వేశారా లేక సాధరణ మహిళగా భావించి వెకిలి చేష్టలు చేశారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యం మత్తులో యువకులు సాక్షాత్తూ ఎమ్మెల్యే తోనే అసభ్యకర సైగలు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *