భారీగా కురుస్తున్న మంచు హిమాచల్ ప్రదేశ్ లో ఆహ్లాదాన్ని పంచుతోంది. ఈ సీజన్ లో తొలిసారి కురినిన మంచును స్థానికులతో పాటుగా పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా లో కురిసిన మంచులో తడిసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపించారు. క్రిస్మస్ సెలవలు కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు సిమ్లాకు చేరుకుంటున్న సమయంలో కురుస్తున్న మంచు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది. రోడ్లపైకి వచ్చిన పర్యాటకు మంచులో ఆడుకున్నారు. పర్యాటకుల సందడితో సిమ్లా రోడ్లలో పండుగ వాతావరణం కనిపించింది. అటు జమ్మూ కాశ్మీర్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాశ్మీర్ లోని అనేక ప్రాంతాలు మంచులో కూరుకుని పోయాయి. హిమపాతంతో కాశ్మీర్ లోని చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నా ఇక్కడ పర్యాటకుల ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు వాపోతున్నారు. పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయిందని వారు చెప్తున్నారు.