ఇదో పైత్యపు సినిమా…ఒక వర్గపు మనోభావాలను దెబ్బతియడం తద్వారా ఫ్రీ ప్రచారం ద్వారా లాభం పొందాలనే ఎత్తుగడో ఏమిటో తెలియదు గానీ “ద్యావుడా” సినిమా పేరుతో విడుదల చేసిన టీజర్ హింధువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉంది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కలియుగ దైవం వేంకటేశ్వరుడి చిత్రపటాన్ని కింద పడవేయడం, శివ లింగానికి సిగరెట్లతో, బీర్లతో అభిషేకించడం లాంటి దృశ్యాల పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. తాను దేవుడితో పర్సనల్ గా మాట్లాడి తీసిన చిత్రం అంటూ ఈ చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి వేసుకోవడం మరీ దారుణం. ఈ టీజర్ పై ఇప్పటికే హింధూ సంఘాల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. వెంటనే ఆ టీచర్ ను యూట్యూబ్ నుండి తొలగించాలని లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
ఈ చిత్ర దర్శకుడిని వెంటనే అరెస్టు చేయాలంటూ భజరంగ్ ధళ్ కార్యకర్తలు నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ టీజర్ ను వెంటనే తొలగించాలని చిత్ర నిర్మాతను భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. అవసరమైన పక్షంలో బౌతిక దాడులకు కూడా దిగుతామని హెచ్చరించారు.