శబరిమల కు మహిళలు వెళ్లొచ్చు-నిషేధం ఎత్తేసిన కోర్టు

0
98
శబరిమల

ఏ వయసు మహిళలు అయినా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం పది నుండి యాబై ఏళ్ల వయసు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా ఉన్న నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదని, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లను ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది.శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి మహిళల వయసుకు సంబంధించి నిబంధనలు విధించడాన్ని అత్యవసరమైన మతపరమైన విధానంగా పరిగణించలేమని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు ఈ తీర్పుతో అంగీకరించగా, ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు.దేశంలో లౌకిక వాతావరణాన్ని కల్పించేందుకు బలంగా నాటుకుపోయి ఉన్న మతపరమైన ఆచారాల్లో మార్పు చేయొద్దని అభిప్రాయపడ్డారు.సతీసహగమనం లాంటి సామాజిక రుగ్మతలు మినహా మతపరమైన విధానాలను తొలగించే దానిపై నిర్ణయం తీసుకునే అంశం కోర్టుకు సంబంధించినది కాదన్నారు.
మరోవైపు ఆలయాల్లో లింగ వివక్షకు తావు లేదని, మహిళలను తక్కువగా బలహీనులుగా చూడడానికి వీల్లేదని తీర్పు సందర్భంగా దీపక్‌ మిశ్ర పేర్కొన్నారు.మతమనేది ప్రాథమిక జీవన విధానంలో భాగమని అన్నారు. మహిళల జీవ సంబంధ(బయోలాజికల్‌) లక్షణాల ఆధారంగా రాజ్యాంగ మార్పు ఉండబోదని వెల్లడించారు. ఈ దేశంలో మహిళలను దేవతల రూపంలో పూజిస్తున్నామని, మరోవైపు లింగ వివక్షతతో ఆంక్షలు విధిస్తున్నామని అన్నారు. పురుషుల కంటే మహిళలు దేనిలోనూ తక్కువ కాదని అన్నారు. మహిళలపై నిషేధం హిందూ మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని పేర్కొన్నారు.
shabarimala, supreme court,
బ్రాహ్మణ పరిషత్ జాబ్ మేళా వాయిదా

Wanna Share it with loved ones?