సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట

selfie with harikrishna సెల్ఫీల పిచ్చికి పరాకాష్ట… రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ బౌతికకాయంతో ఆస్పత్రికి సిబ్బంది దిగిన సెల్ఫీ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి….
నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను నార్కెట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిచెందిన తరువాత ఆయన మృతదేహంతో ఆస్పత్రికి చెందిన నలుగురు సిబ్బంది సెల్ఫీ దిగారు. అదికాస్తా బయటికి పొక్కడంతో ఆస్పత్రి సిబ్బందిపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస జ్ఞానం లేకుండా ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇద్దరు నర్సులు, ఒక వార్డ్ బాయ్, ఒక ఆయా ఫొటో దిగినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నట్టు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. వారిని వెంటనే ఉద్యోగాల నుండి తొలగించడంతో పాటుగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించింది. హరికృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు కామినేని యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.

హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా