చరిత్ర పుట్టల్లోఎస్.బీ.హెచ్

గన్ ఫౌండ్రీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యలయం… నగర వాసులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు… గన్ ఫౌండ్రీ లో ఉండే ఈ చారిత్రత్మక భవనం, ఎస్బీహెచ్ ప్రధాన కార్యలయం ఇక నుండి చరిత్రలో కలిసిపోనున్నాయి. 75 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇక నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయిపోనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్టేట్ బ్యాంకులు అన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానున్న నేపధ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. నిత్యం వేలాది మంది ఖాతాదారులతో కళకళలాడే గన్ ఫౌండ్రీలోని ఎస్బీహెచ్ ప్రధాన కార్యాలయంలో అన్ని ప్రభుత్వ ఛలాన్లు కట్టించుకుంటారు. చలాన్లకు పెట్టింది పేరైన ఎస్బీఎచ్ కు వచ్చే ఖాతాదారులతో పాటుగా వందలాది మంది చలాన్ ఫాం లు అమ్ముకుంటూ ఇతరత్రా చిన్నచిన్న పనులు చేస్తూ దీనిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. గన్ ఫౌండ్రీ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయాన్ని 1955లో ప్రారంభించారు. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఈ భవాన్ని ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద హాల్ గా ఈ భవన హాల్ కు పేరుంది. మొదట హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ గా ఉండిన ఈ బ్యాంకు నిజాం హయాంలో మొదలైంది. అటు తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా తన ఆధినంలోకి తీసుకున్న తరువాత దిన దిన ప్రవర్తమానంగా ఎదిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దేశంలోనే అతి ప్రధాన బ్యాంకుల్లో ఒకటిగా ఎదిగింది.
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రాప్రాంతానికి చెందిన చలాన్లు అన్నీ ఆంధ్రాబ్యాంకులో చెల్లించడం మొదలు పెట్టిన తరువాత ఇక్కడ కొద్దిగా రష్ తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చలాన్లను ఇక్కడే చెల్లిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం రానున్న రోజుల్లో ఎటువంటి పనులు నిర్వహిస్తుందో చూడాల్సి ఉంది. బ్యాంకు కార్యకలాపాల్లో ఎటువంటి మార్పులు ఉండవని కేవలం పేరు మార్పు మాత్రమే ఉంటుందని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. అయినా పేరు మార్పుతో ప్రధాన కార్యాలయం హోదా మాత్రం పోనుంది. మొత్తంమీద 75 సంవత్సరాల చరిత్ర ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇక చరిత్రలో కలిసిపోనుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *