'మహానటి'లో నాన్నాను విలన్ గా చూపించారు: కమలా సెల్వరాజ్

0
99
savitri with jamini ganeshan

సినీ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ‘మహానటి’ చిత్రంలో తన తండ్రి పాత్రను చాలా తక్కువచేసి చూపించారని, తన తండ్రిని ఒక విలన్ గా చిత్రీకరించారని జెమినీ గణేషన్ కుమారై కమలా సెల్వరాజ్ ఆరోపించారు. జెమినీ గణేషన్ మొదటి భార్య అలివేలు కుమారై అయిన తమిళనాడులో ప్రముఖ వైద్యురాలిగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ని సృష్టించిన ఆమె పలు అవార్డులను అందుకున్నారు.
సావిత్రి జీవిత చరిత్రను గొప్పగా చూపించే క్రమంగా తన తండ్రిని గురించి అబ్బద్దాలను నిజాలు చెప్పే ప్రయత్నం చేశారని అమె అంటున్నారు. సావిత్రి జీవితం విషాదాంతం కావడానికి తన తండ్రే కారాణంగా సినిమాలో చూపెట్టారని అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఆమె చెప్పారు.
సావిత్రి ఒక గొప్ప నటిమాత్రమే కాదని చాల మంచి మనసున్న మనిషని కమలా స్వెల్వరాజ్ చెప్పారు. అమె మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఉండేదని, అందరినీ గుడ్డిగా నమ్మెదని అదే చివరికి ఆమె ఆస్తిపాస్తులను కరిగించివేశాయని అన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఇందులో తన తండ్ర జెమినీ గణేషన్ పాత్ర ఏమీలేదన్నారు. మధ్యానికి అలవాటు పడినతరువాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయిందని ఆమెకు తన తండ్రి మధ్యం అలవాటు చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. తన తల్లి బతికున్న సమయంలోనే సావిత్రి జెమినీ గణేశన్ కు దగ్గరయిందని అయినా తన తల్లి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదన్నారు.
మహానటి సావిత్రి చిత్రంలో సావిత్రి వల్లే జెమినీ గణేశన్ కు సినిమా అవకాశాలు వచ్చినట్టుగా చూపించారని అది ఏమాత్రం నిజంకాదన్నారు. తన తండ్రి తమిళనాడులో అగ్రహీరోల్లో ఒకరని ఎంజీఆర్, శివాజీ గణేశన్ లకు సమాన స్థాయిలో జెమినీ గణేశన్ వెలుగొందారని అన్నారు. తన తండ్రీ చాలా గొప్ప వ్యక్తని ఆయన ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడని చెప్పారు. సినిమాలో చూపించిన శంకరయ్య పాత్ర ఎవరిదో ఆయన ఎవరో తమకు తెలియదని కమలా సేల్వరాజ్ స్పష్టం చేశారు.
‘మహానటి’ సినిమా యూనిట్ ఎవరూ చిత్ర నిర్మాణానికి ముందు తనను కలవలేదని అన్నారు. సావిత్రికి జెమినీ గణేశన్ అన్యాయం చేశారని జరుగుతున్న ప్రచారం తమను చాలా బాధిస్తోందన్నారు. తన తండ్రి సావిత్రి కోసం చాలా చేశారని అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆమెకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఈ పరిస్థితుల కారణంగానే సావిత్రి ఆఖరి సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. సావిత్రి ఆస్తులను అన్నీ తన తండ్రి తీసేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు.
సావిత్రి చనిపోచిన తరువాత ఆమెను ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదన్నారు. ఆమె భౌతికకాయాన్ని తమ ఇంటికే తీసుకుని వచ్చారని తమ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారని చెప్పారు. పెద్ద సంఖ్యలో సావిత్రి అభిమానులు ఆమెకు అంతిమ వీడ్కలో పలికారని కమలా సెల్వరాజ్ చెప్తున్నారు.
తన తండ్రికి అనేక మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఆడవారి విషయంలో ఆయన కొంత బలహీనతను చూపించేవారని ఇదే ఆయనకు చెడ్డపేరు తెచ్చిందన్నారు. తన తండ్రి ఏ మహిల వెంట పడలేదని వారే ఆయన పట్ల ఆకర్షితులయ్యారని ఆమె వివరించారు.
సావిత్రిని గురించి తన తల్లికి గానీ, తనకు గానీ ఎటువంటి కోపం లేదన్నారు. చిన్న వయసులోనే ఆమె చనిపోవడం బాధాకరమన్నారు. సావిత్రి తమను తన స్వంత పిల్లలుగా ఆదరించారని అన్నారు. కల్లాకపటం తెలియని సావిత్రి జీవితంలో చాలా కోల్పోయారని ఆమె చివరకు విషాధాంతం కావడం బాధాకరమన్నారు.
mahanati, savitri, cine heroine savitri, jemini ganeshan, madaras, chennai,
Savitri , mahanati movie.

ప్రజలు ఆశీర్వదిస్తే జనసేన దే అధికారం:పవన్ కళ్యాణ్


గరిష్ట స్థాయికి చేరుకున్న చమురు ధరలు
Savitri_(actress)

Wanna Share it with loved ones?