సౌదీ విమానాశ్రయంపై క్షిపణి దాడి

0
81

సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగింది. సౌదీ ఏర్పాటు చేసుకున్న పెట్రియాట్ రక్షణ వ్యవస్థ సకాలంలో పనిచేయడంతో క్షిపణిని దారిలోనే కూల్చివేసింది. యెమన్ లో హౌతీ తీవ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. సౌదీ విమానాశ్రయంపై తామే దాడులు జరిపామని హౌతీ తీవ్రవాదులు ప్రకటించారు. సౌదీకి బుద్ది చెప్పడానికే ఈ దాడిని నిర్వహించినట్టు హౌతీ ప్రకటించింది. తాము దేశీయంగా తయారుచేసిన క్షిపణిని సౌదీపై దాడికోసం వినియోగించినట్టు ఆ వర్గాలు ప్రకటించాయి. సౌదిపై జరిగిన క్షిపణి దాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే సౌదీ-యెమన్ ల మధ్య తీవ్ర స్థాయిలో ఉన్న విభేదాలు మరింత తీవ్రం కావచ్చని భావిస్తున్నారు. హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ మద్దుతు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ-ఇరాన్ ల మధ్య కూడా ఉధ్రిక్తతలు పెరిగే అవకాలున్నాయి.
తమ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడిజరిగిందని అయితే తమ రక్షణ వ్యవస్థ వాటిని మధ్యలోనే అడ్డుకుని కూల్చేసిందని సౌదీ అధికారులు వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.07 ప్రాంతంలో ఈ దాడికి జరిగినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. పెట్రియాట్ రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో క్షిపణి విమానాశ్రయానికి తూర్పు వైపు నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని సౌదీ వర్గాలు వెల్లడించాయి.
https://www.youtube.com/watch?v=DQ2n2-RjPQY

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here