బిత్తిరి సత్తిపై దాడి

0
112

బిత్తిరి సత్తిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచుడైన రవిపై దాడి జరిగింది. ఆయన పనిచేస్తున్న వి6 కార్యాలయం ముందే సత్తిపై దాడిచేసి ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో అతనికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఛానల్ సిబ్బంది తేరుకుని సత్తిని దాడి నుండి రక్షించడంతో పాటుగా దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిచేసిన వ్యక్తులు పూర్తిగా మధ్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్డిన వ్యక్తి పేరు మణికంఠగా చెప్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సత్తిపై ఎందుకు దాడిచేసిందనే విషయంలో పొంతనలేకుండా మాట్లాడుతున్నాడు. తెలంగాణను అగౌరవ పరిచే విధంగా సత్తి వ్యవహరిస్తున్నందేకే అతనిపై దాడికి పాల్పడినట్టు చెప్తున్నాడు. పంజగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సత్తికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here