జయలలిత మరణంతో అన్నీ కోల్పోయా:శశికళ

 
sasikala
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత సన్నిహితురాలు శశికళ చేపట్టారు. జయ మరణంతో ఖాళీ అయిన పార్టీ అత్యన్నత పదవికి శశికళను అన్నాడీఎంకే పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. పార్టీ భాద్యతలను స్వీకరిస్తూ జయను తల్చుకుని శశికళ కన్నీరు పెట్టుకున్నారు. జయ ఎప్పుడూ ధరించే ఆకుపచ్చని చీరలో పార్టీ కార్యాలయానికి వచ్చి పదవీ బాధ్యతలు చేపట్టిన శశికళ తనకు జయతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత మీడియాతో శశికళ మాట్లాడారు. తాను 33 సంవత్సరాల పాటు జయలలితతో కలసి ఉన్నానని ఆమె మరణించిందనే వాస్తవాన్ని జీర్ణించుకుకోలేకపోతున్నానని అన్నారు. జయలలిత రాజకీయ జీవితం మొత్తం అమె వెన్నంటే ఉన్నట్టు చెప్పారు. జయలలిత రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లకు గురయ్యారని అన్ని సందర్భాల్లోనూ జయలలితోనే తాను కొనసాగినట్టు శశికళ పేర్కొన్నారు. జయలలిత రాజకీయ జీవితం ప్రారంభం అయినప్పటి నుండీ జయలలిత వెంటే తాను నడిచినట్టు చెప్పారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా జయలలిత అన్ని సందర్భాల్లోనూ చాలా నిబ్బరంగా ఉండేవారని శశికళ గుర్తు చేశారు. జయలిలత చనిపోవడంతో తాను అన్నీ కోల్పోయినట్టయిందని శశికళ అన్నారు. జయలలిత ఆసుపత్రిలో చేరినతరువాత క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగవుతూ వచ్చిందని ఒక్కసారిగా ఆమెకు గుండెపోటు రావడంతో మరణించారని చెప్పింది. జయలలితను రక్షించుకోవడానికి దేశ విదేశాలకు చెందిన వైద్యులు ఎంత ప్రయత్నించినా చివరకు ఫలితం దక్కలేదని శశికళ ఆవేదన వ్యక్తం చేశార.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *