అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని దోషిగా సుప్రీం కోర్టు నిర్ధారించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో శశికళ ఇప్పుడు జైలుకు వెళ్లని తప్పని పరిస్థితి. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిర్థారిస్తూ అదే శిక్షను ఖరారు చేసింది. శశికళతో పాటుగా దినకరన్, ఇలవరసిలు వెంటనే ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశిందింది. ట్రయల్ కోర్టు గతంలో శశికళతో పాటుగా మరో ఇద్దరికి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అదే శిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేస్తు వెంటనే కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో శశికళ ఇప్పుడు జైలుకు పోకతప్పని పరిస్థితి. శశికళ ఇతరులు ఎప్పుడు లొంగిపోతారనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో అనుభవించిన శిక్షను శిక్షా కాలం నుండి మినహాయిస్తున్నట్టు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలనే శశికళ ఆశలపై సుప్రీం కోర్టు నీళ్లు చల్లినట్టే కనిపిస్తోంది. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఇప్పుడు శశికళ వర్గం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది ఆశక్తిగా మారింది.