చిక్కుల్లో సరూర్ నగర్ సిఐ

సరూర్ నగర్ సర్కిల్ ఇన్పెక్టర్ లింగయ్య చిక్కుల్లో పడ్డారు. యూనిఫాంలో ఉన్న ఓ హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. కింది స్థాయి సిబ్బందిని స్వంత పనులకోసం ఉపయోగించుకునే ఆర్డిలరీ వ్యవస్థ పోలీసు శాఖలో బలంగా నాటుకుని పోయింది. హోం గార్డులు పెద్ద సార్ల ఇళ్లలోనూ, స్వంత పనులను చేయడం పరిపాటిగా మారింది. దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ అడపాదడపా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హోం గార్డు చేత మసాజ్ చేయించుకుంటున్న సీఐ వీడియో బయటికి వచ్చింది. హోం గార్డు మసాజ్ చేస్తున్న సమయంలో సిఐ లింగయ్య మధ్యం సేవిస్తున్నట్టు కనిపిస్తోంది. సీఐ లింగయ్య నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటున్నట్టు తనపై వస్తున్న వార్తలను సరూర్ నగర్ సి.ఐ లింగయ్య ఖండించారు. తాను ఏ హోంగార్డుతోనే మసాజ్ చేయించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఛానళ్లలో ప్రసారం అవుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని లింగయ్య అంటున్నారు.వీడియోలో ఉన్న వ్యక్తి పర్సలానిటీకి తన పర్సనాలిటికీ తేడా ఉందని అంటున్న లింగయ్య తనను అప్రదిష్టపాలు చేసేందుకే ఈ వీడియోను ప్రచారం చేస్తున్నరని అంటున్నారు. అసలు తనకు మధ్యం తాగే అలవాటే లేదని సిఐ చెప్తున్నారు. వీడియోలో ఉన్న హోంగార్డు సైదయ్యకు రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయని అతను రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదని లింగయ్య తెలిపారు. మరో వైపు సరర్ నగర్ సిఐపై ఉన్నాతిధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు హోంగార్డులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *