భర్తనే కోల్పోయాను… ధైర్యాన్ని కాదు… : వీరజవాను భార్య

దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాను లాన్స్ నాయక్ సందీప్ సింగ్ అంత్యక్రియలు అతని స్వస్థలం గురుదాస్ పూర్ లో జరిగాయి. సైనిక లాంఛనాల ప్రకారం జరిగిన అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో స్థానికులు హాజరయ్యారు. మంగళవారం జమ్ముకాశ్మీర్ లోని ఎల్ఓసీ వద్ద జరిగిన కాల్పుల్లో సందీప్ సింగ్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. సైనికులపై దొంగచాటుగా కాల్పులకు తెగబడ్డ ముష్కరులను ధీటుగా ఎదుర్కొని ఇద్దరు తీవ్రవాదులను మట్టుపెట్టిన తరువాత సందీప్ సింగ్ ప్రాణాలు విడిచాడు. భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ లోనూ ఆయన పాల్గొన్నారు. అత్యంత ప్రతీభాశీలురుగా, ధైర్యవంతుడిగా పేరుంగాంచిన సందీప్ సింగ్ దేశంకోసం ప్రాణాలు అర్పించాడని సైనిక అధికారులు పేర్కొన్నారు.
దేశం కోసం ప్రాణాలు విడిచిన భర్త మృతదేహాన్ని చూసిన గుర్ ప్రీత్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన భర్త దేశంకోసం ప్రాణాలను కూడా విడిచిపెట్టడం గర్వంగా ఉందని ఆమె చెప్పారు. తన భర్త నడిచిన మార్గంలోనే తన కుమారుడిని కూడా పెంచుతానని వాడిని కూడా సైన్యంలో చేర్పిస్తానని అమె చెప్తోంది. తన బిడ్డకు దేశభక్తి అంటే ఏమిటో తెలిసేలా పెంచుతానని ఆమె అన్నారు. తండ్రి మృతదేహం వద్ద సందీప్ సింగ్ కుమారుడు సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేశాయి.
తన భర్తను కోల్పోయినా ఆయన చెప్పిన విషయాలు తనకు గుర్తున్నాయని అదే ధైర్యంతో ముందుకు సాగుతానని అన్నారు. తన కుమారుడిని దేశంకోసం సైన్యంలో పంపడమే తన లక్ష్యమని చెప్పారు.
lance naik sandeep singh , sandeep singh wife, sandeep singh son.
విద్యావిధానంలో నూతన ఒరవడి ఎడ్యూవెకేషన్