15న బ్రాహ్మణ వ్యాపారుల, ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం

0
76

బ్రాహ్మణ వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు సనాతన ఎంటర్ ప్రియునర్స్ అసోసియేషన్ (సీ) SANATHANA ENTREPRENEURS ASSOCIATION ( SEA) ప్రతినిదులు తెలిపారు. ఈనెల 15వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు మేడిపల్లిలోని ఎం కన్వేన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. బ్రాహ్మణ వ్యాపారులందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చే క్రమంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కే.వీ. రమణా చారి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి, బీజేపీ నాయకురాలు గీతా మూర్తీలతో పాటుగా వివిధ రంగాలకు చెందిన బ్రాహ్మణ ప్రముఖులు హాజరుకానున్నట్టు వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జాబా మేళాతో పాటుగా బ్రాహ్మణ వ్యాపారులు వివిధ రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని బ్రాహ్మణ బంధువలంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమం అనంతరం ఆహుతులందరికీ భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవస్థాపకులు అమృత్ ముళ్లపూడి, సహ వ్యస్థాపకులు ఆనంద్ నాయక్, ఛైర్మన్ డాక్టర్ ఎస్ రాంగోపాల్, అధ్యక్షులు ఎస్.బి.రామ్, ఐటీ ఆపరేషన్స్ విభాగం ఉపాధ్యక్షులు వెంకటనిరంజన్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శిరీష, కార్యదర్సి కృష్ణ, కోశాధికారి మురళీధర్ లు తెలిపారు. ఇతర వివరాల కోసం 8125427034, 9966238184 నెంబర్లలలో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని వారు వివరించారు.

Wanna Share it with loved ones?