ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు జీతం కట్

ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తో ఒకరోజు విధులకు గౌర్హాజరైన ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. పింఛన్ విధానంలో మార్పుల కోసం సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టి విధులను బహిష్కరించారు. ఉద్యోగ సంఘాల పిలపుమేరకు ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. అయితే విధులకు హాజరు కానందరి జీతాల్లో ఒక రోజు జీతంపై కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఆరోజు కార్యాలయాలకు వెళ్లని వారందరి జీతాల్లో కోత పడనుంది.
విధులకు గైర్హాజరైన రోజున సెలవు మంజూరు చేయడం కుదరదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనితో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల జీతాల్లో కోత పడనుంది. ప్రభుత్వ నిర్ణయం పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *