February 28, 2020

ఎమ్మెల్సీ రాంచంద్రరావుకు మాతృ వియోగం

బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు మాతృమూర్తి నారపరాజు రాఘవ సీత శనివారం ఉదయం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తార్నాకాలోని రాంచంద్రరావు నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారైలున్నారు. వీరిలో రాంచంద్రరావు మొదటి పుత్రుడు కాగా రెండవ కుమారుడు రమణారావు ఎఐఐటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మూడవ కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. ఒక కుమారై పద్మ ప్రఖ్యాత స్త్రీల వైద్య నిపుణురాలు. మరో కుమారై గృహిణి. రాఘవ సీత మృతి పట్ల పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులతో పాటుగా ఇతర రాజకీయ ప్రముఖులు, ప్రజలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.