100 మంది మహిళలతో కలిసి శబరిమలకు

0
62

వంద మంది మహిళలతో కలిసి శబరిమల ఆలయంలోకి ప్రవేశించనున్నట్టు భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ ప్రకటించారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించడంపై తమకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపధ్యంలో తాను శబరిమల ఆలయంలోకి మరో వంద మంది మహిళలతో కలసి ప్రవేశిస్తానని తృప్తి దేశాయ్ చేసిన ప్రకటన తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కొన్ని ఆలయాలు ప్రార్థనా మందిరాల్లోకి మహిళలను అనుమతించకపోవడం రాజ్యంగం ప్రకారం మహిళలకు కల్పించిన సమాన హక్కుకు విఘాతమని తృప్తి దేశాయ్ వాదిస్తున్నారు. మహిళలకు ప్రవేశం లేని శనీ సింగణాపూర్, త్తయంబకేశ్వర్, హాజీ ఆలీ దర్గాల్లోకి కూడా ఆమె తన అనుచరగణంతో ప్రవేశించారు. తాజాగా శబరిమల లోకి కూడా ప్రవేశిస్తానని ప్రకటించారు.
మరో వైపు తృప్తి దేశాయ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించనీయమని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసుగల మహిళలకు ప్రవేశం లేదని ఈ  నిబంధన అందరికీ వర్తిస్తుందని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా వాద్దా అనే విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోందని తీర్పు వచ్చే వరకు పాత నిర్ణయాన్నే కొనసాగిస్తామని కేరళ ప్రభుత్వం పేర్కొంది. తృప్తి దేశాయ్ ప్రకటన నేపధ్యంలో ఆలయ పరిసరాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here