రైతు బంధు పథకం దేశానికే ఆదర్శం: కేసీఆర్

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవయానికి అనుసంధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈ మేరకు ఒక తీర్మాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో వ్యవసాయానికి అనుసంధానం చేయాల్సిందిగా తాను చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “రైతు బంధు” పథకాన్ని కరీనంగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చేల్ పూర్ వద్ద కేసీఆర్ ప్రారంభించారు. ప్రతీ ఎకరానికి 8వేల రూపాయలను రైతులకు వ్యవసాయ పెట్టుబడికోసం అందించే ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వం తరపున రైతులకు మాత్రమే సహాయం అందుతుందని కౌలుదారులకు కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కౌలుదారుల సంగతి రైతులే చూసుకోవాలని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
• కరీంనగర్ జిల్లా అంటే నాకు సెంటిమెంట్ , ఇక్కడి నుండి ప్రారంభించే ఏ పనైనా వందశాతం పూర్తవుతుంది.
• దేశంలో 24 గంటలకు రైతులకు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
• రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధరను పెంచాలి. ఇప్పుడిస్తున్న కనీస మద్దతు ధరకు మరో నాలుగో శాతం పెంచి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలి.
• రైతు బంధు పథకం దేశంలోనే ఒక చరిత్ర
• ఈ పథకం కేసం 12వేల కోట్ల రూపాయలు కేటాయించాం.
• ఇప్పటికే బ్యాంకులకు 6వేల కోట్ల రూపాయలు చేరాయి.
• కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మూడు పంటలకు నీళ్లు అందుతాయి.
• నాడు కాంగ్రెస్ నేతలు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగారు. ఇప్పుడు మాత్రం ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు.
• కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు.
• రైతులను కాపడమే మా ప్రభుత్వ లక్షం, వారి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం లాక్కోదు.
• పెట్టుబడి రైతులకు మాత్రమే ఇస్తుంది. కౌలుదారులకు కాదు.
• కౌలుదారుల సంగతి రైతులే చూసుకోవాలి.
• కౌలు దారులకు పెట్టుబడి డబ్బులు అందవు. రైతులకోసమే ఈ పథకాన్ని చేపట్టాం.
• తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ రైతుకు చెక్కులు అందుతాయి.
• రైతు బంధు పథకం దేశంలోనే ఉత్యత్తమం.
• వ్యవసాయం బాగుంటేనే దేశం బాగుంటుంది.
• చెక్కుల పంపిణీ విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా రైతు సమన్వయ సమితి సభ్యులు చొరవ చూపాలి.
• టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎరువులు, విత్తనాలకోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి మారింది.
• రైతు ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికోసం మరన్ని కొత్త పథకాలు తీసుకుని వస్తాం.
• కోటి ఎకరాలు పచ్చబడే వరకు కేసీఆర్ నిద్రపోడు. చెక్ డ్యాంలు, ప్రాజెక్టుల ద్వారా సాగునీటి అవసరాలు తీరుస్తాం.
• తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడా జరగడం లేదు.
• అగ్రకులాల్లోని పేదలను ఆదుకుంటాం, వారికోసం త్వరలో కొత్త పథకం.
• అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోంది.
• మత్యకారులను ఆదుకుంటున్నాం, యాదవుల సోదరులకు చేయుతనిచ్చాం.
• మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేటాయింపులు.
• మిషన్ భగీరథ దేశంలోనే ఎక్కడా లేని పథకం, ప్రపంచం యావత్తూ ఈ పథకాన్ని చూపి అబ్బురపడుతోంది.
• ఉద్యోగులు రాష్ట్ర అభివృద్దిలో కీలలపాత్ర పోషిస్తున్నారు.
• ఉద్యోగుల కృషివల్లే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి.
• ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి.
• వైద్యుల పనితీరు , కేటీఆర్ కిట్ ల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి.
• గతంలో ఉన్న అడ్డగోలు పద్దతులకు స్వస్తి చెప్పి అధికారులను పెంచి వ్యవసాయదారులకు ప్రభుత్వం అండగా ఉంటోంది.
• వ్యవసాయం దండగ కాదు పండగ అనే రోజులు రావాలి. దీని కోసం మన మంతా కష్టపడాలి.
• కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టింది.
• టీఆర్ఎస్ తెలంగాణను సాధించిన పార్టీ అయితే కాంగ్రెస్ తెలంగాణను వేధించిన పార్టీ .
• భూరికార్డులను ప్రక్షాలన చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.
• మేం గప్పాలు కొట్టడం లేదు వాస్తవాలు చెప్తున్నాం.
telangana, telangana cm, kcr, telangana cm kcr, rythu bandhu, rythu bandhu pathakam,farmer , telangana farmer, telangana farmers.

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల లెక్కలు చెప్పాల్సిందే
Agriculture_in_India
https://www.facebook.com/KalvakuntlaChandrashekarRao/videos/610338172654434/