ఘోరరోడ్డు ప్రమాదం-25మంది చిన్నారులు మృతి

 

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది చిన్నారులు మృతిచెందారు. మరో 30 మంది గాయపడ్డారు. యూపీలోని ఎటా జిల్లాలోని అలీగంజ్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గట్టంగా అలముకున్న పొగమంచు, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం 24 మంది చిన్నారుల నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. పాఠశాల బస్సు-ట్రక్కు ఢీకోన్న ఈ ఘటనకు ప్రధానంగా పొగమంచే కారణమని చెప్తున్నారు. పొగమంచు వల్ల వాహనాలు కనిపించకపోవడంతో రెండు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయని  పోలీసులు పేర్కొన్నారు. పొగమంచు కారణంగా పాఠశాలలకు సెలవలు ప్రకటించినప్పటికీ దాన్ని పెటచెవిన పెట్టిన పాఠశాల యాజమాన్యపు నిర్లక్ష్యానికి ఇంత మంది చిన్నారుల జీవితాలు బలైపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స జరిపిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో 25 మంది చిన్నారు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.