ఆస్తులపై విచారణకు కేసీఆర్ సిద్దమా: రేవంత్ సవాల్

revanth reddy on it rides :తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్ధమని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్ధం కావాలని కాంగ్రెస్ వర్గింక్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రెండు రోజులుగా రేవంత్ రెడ్డితో పాటుగా ఆయన బంధువల ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన నివాసంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ సవాల్ ను దమ్ముంటే ముఖ్యమంత్రి స్వీకరించాలన్నారు. దీని కోసం తాను వారికి 24 గంటల సమయం ఇస్తున్నానని దానికి వారు సిద్ధపడకపోతే అవినీతికి పాల్పడినట్టుగానే భావించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెరాస నేతలు కాంగ్రెస్‌ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమీ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు, పోలీసు కేసులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసార మాధ్యమాలు అవాస్తవాలు ప్రచారం చేశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబాన్ని క్షోభకు గురిచేసే విధంగా మీడియాలో వార్తలు వస్తున్నాయని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.మలేసియా, సింగపూర్‌లో వ్యాపారాలు చేసినట్లు పేర్కొంటున్నారని మండిపడ్డారు. ఆయా దేశాల్లో ఖాతాలు తెరవాలంటే ఆ దేశ పౌరుడై ఉండాలని వివరించారు.
జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని తన కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని తెలిపారు.2014లో బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నిర్మాణానికి రుణాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 2009 తర్వాత తాను ఎక్కడా ఆస్తులు కొనుగోలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి, కొండారెడ్డి, కొడంగల్‌లో ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచామని వివరించారు. నకు పిల్లను ఇచ్చిన మామ కిరోసిన్‌ హోల్‌సేల్‌‌ డీలర్‌ అని.. 1992 కంటే ముందే ఆయనకు హైదరాబాద్‌లో భూములు ఉన్నాయని రేవంత్‌ తెలిపారు.
తనకు అండగా నిల్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, తన అభిమానులకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
revanth reddy, revanth, congress, congress party.
శబరిమల కు మహిళలు వెళ్లొచ్చు-నిషేధం ఎత్తేసిన కోర్టు