రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

0
85
రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నాయకుడు, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న ఇన్ కం ట్యాక్స్, ఎన్ ఫోర్సమెంట్ దాడులు కలకలం రేపుతున్నాయి. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి నివాసాలపై ఐటిశాఖ దాడులు చేస్తోందని దీనివెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన నియోజకవర్గం కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు వెనక్కి పిలిపించారు. తనను ప్రచారంలో పాల్గొననీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తన నివాసంపై ఐటి దాడులు జరుగే అవకాశం ఉందని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలను కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.
ఐటి అధికారులు సూచనల మేరకు కొడంగల్ నుండి ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన తన నివాసానికి చేరుకున్న సమయంలో అక్కడ స్వల్ప ఉధ్రిక్తత నెలకొంది. తమ నేత రాకముందే అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక పథకం ప్రకారం పనిగట్టుకుని ఎన్నికల ముందు రాజకీయంగా దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి నివాసం పై దాడులు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. వారు ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉధ్రిక్తత నెలకొంది. అయితే కార్యకర్తలకు రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నేతలు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
బీజేపీ, టీఆర్ఎస్ లు రెండూ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు, పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టేందుకు పోలీసులను ఉపయోగించుకుంటోందని పాత కేసులను తిరగదోడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే కేసులు పెడుతున్నారని వారు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ కి సంబంధించిన కేసులోనూ ఇటీవల రేవంత్ రెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
revanth reddy, it rides on revanth reddy house.
విద్యావిధానంలో నూతన ఒరవడి ఎడ్యూవెకేషన్

Wanna Share it with loved ones?