తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్లేట్ మార్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ఆ వార్తలను ఖండించకపోగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించిన రేవంత్ ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్తున్నాడు. మీడియాలో తనపై వస్తున్నవార్తలను ఖండిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. తనమీద, తమ పార్టీ నేతలపైనే వస్తున్న వార్తల వల్ల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని రేవంత్ అంటున్నారు. పేదల కోసం పోరాడి తాను ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నానని అంటున్న రేవంత్ రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన వ్వూహాలపై చర్చిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 26న టీడీఎల్పీ సమావేశాన్నినిర్వహిస్తున్నామని దాంట్లో అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తామని అంటున్నారు.