భారత రాజ్యాంగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. భారత పౌరులమైన మేము అంటూ మొదలయ్యే మన రాజ్యాంగాన్ని భారత ప్రజలంతా కలసికట్టుగా రాసుకున్నారు. గీత,ఖురాన్,బైబిల్, గ్రంద్ సాహేబ్ ఆయా మతాలకు పవిత్ర గ్రందాలు అయితే భారత రాజ్యాంగం భారతీయులందరికీ ఆచరణీయమైన అతి పవిత్ర గ్రందం. మన రాజ్యాంగానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. వాటిలో కొన్ని
- ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ
- రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూల్స్ ఉన్నాయి.
- రాజ్యాంగ పరిషత్ చిహ్నం: ఏనుగు
- హెచ్వీ కామత్ భారత రాజ్యాంగాన్ని దేవేంద్రుని ఐరావతంతో పోల్చాడు.
- భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ కొల్లగొట్టి రూపొందించిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను: డా. బీఆర్ అంబేద్కర్.
- భారత రాజ్యాంగంలో మొత్తం 60 దేశాలకు సంబంధించిన అంశాలను క్రోడీకరించారు.
- భారత రాజ్యాంగంలో దృఢ-అధృడ రాజ్యాంగ సవరణ పద్దుతులు
- రాజ్యంగంలో ఏక కేంద్ర సమాఖ్య లక్షణాలు రేండూ ఉన్నాయి.
- కేంద్ర-రాష్ర్టాల మధ్య అధికారాల విభజన
- పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్దతి
- ప్రాథమిక హక్కులు, విధులు
- సర్వోన్నత న్యాయ వ్యవస్థ
- సంతంత్ర్య న్యాయ వ్యవస్థ
- సార్వజనీన వయోజన ఓటు హక్కు
- అందరికీ సమాన చట్టం.
- ఏక పౌరసత్వం.