పట్టువిడవని గైక్వాడ్-బెట్టువిడని ఎఫ్ఐఎ

వివాదాస్పద శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ పట్టువిడవడం లేదు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన తరువాత గైక్వాడ్ పై ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎయిర్‌లైన్స్‌(ఎఫ్‌ఐఏ)  ఆయన పేరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఆయన తమ విమానాల్లో ప్రయాణించడానికి వీలు లేకుండా విమానయాన సంస్థలు నిషేధం విధించాయి. ఆతరువాత కూడా గైక్వాడ్ మూడు సార్లు ఎయిర్ ఇండియాలో టికెట్ బుక్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు సార్లు టికెట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత ఆయన ఇండిగో విమానంలో టికెట్ ను బుక్ చేసుకోగా అది కూడా క్యాన్సిల్ అయింది. తాజాగా పూణే నుండి అహ్మదాబాద్ కు వెళ్లేందుకు గైక్వాడ్ స్పైస్ జెట్ లో టికెట్ బుక్ చేసుకోగా దాన్నికూడా ఆ సంస్థ రద్దు చేసింది. ఎఫ్ఐఏ గౌక్వాడ్ పై నిషేధం విధించడంతో ఆయన విమాన ప్రయాణాలను విమానయాన సంస్థలు అడ్డుకుంటున్నాయి.  ఇండిగో, స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, గోఎయిర్‌ సంస్థలు ఎఫ్‌ఐఏలో సభ్యులుగా ఉన్నాయి.