దైవం మానవ రూపంలో…

0
97

-అలెకోట చంధ్రశేఖర్
ఆపదలో ఆదుకునే వారిని దైవంతో పోలుస్తాం… అవసరం ఉన్నప్పుడు సహాయం చేసినవారిని సాక్షాత్తు దేవునికి ప్రతిరూపంగా కొలుస్తాం… ఎవరైనా ఆపదలో ఉన్నసమయంలోనూ లేదా సహాయం అవసరం అయినపుడు దేవుడే రానవసరంలేదు. ఆయన ఏరూపంలో అయినా మన ముందుకువచ్చి ఆపదలనుండి గట్టెక్కిస్తాడు… అవసరానికి ఆదుకుంటాడు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగానే కడపజిల్లా, రాయచోటి కాలూకా, పడమటికోన, తోగుటపల్లి వాసి బొమ్మిశెట్టి సుబ్బరామన్న ఉదంతాన్నిచెప్పుకోవచ్చు…
తోగుటపల్లి అనే చిన్న గ్రామానికి చెందిన బొమ్మిశెట్టి సుబ్బరామన్న చిన్నా చితకా వ్యాపారాలు చేశాడు. కాలం, ఖర్మం కలిసిరాక వ్యాపారంలో నష్టం వచ్చింది. గ్రామంలో ఇక చేసేదేమీ అతనికి కనిపించలేదు. అప్పటికే తన గ్రామానికి చెందిన అనేక మంది బాటలోనే తాను నడవడానికి సిద్ధమయ్యాడు. నగరానికి వలసపోయి కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకుందామనుకుని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ ప్రతినిధులు అనుకోకుండా అతన్ని కలిశారు. స్థానిక నరసింహ స్వామి దేవాలయంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకోసం వచ్చిన ట్రస్టు సభ్యులు బొమ్మిశెట్టి నివాసం ముందున్న అరుగు మీద సేదతీరారు. ఆయనతో మాటా మాట కలిపారు. తాను గ్రామం వదిలి పట్టణానికి వలసపోయేందుకు నిర్ణయించుకున్నట్టు రామన్న వారికి చెప్పడంతో గ్రామంలోనే బతుకుతెరువుకు ఉన్న అవకాశాలను పరిశీలించమని చెప్తూ చాలా మంది బడిపిల్లలు ఆవీధి గుండా నడుస్తుండడాన్ని చూసి వారికి అవసరం అయిన తినుబండారాలు అమ్మితే లాభంగా ఉంటుందని సూచించారు….
చిరు వ్యాపారం చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని అయితే అందుకుకావాల్సిన కొద్దిపాటి పెట్టుబడికూడా అతని వద్ద లేదని తెలుసుకున్న ట్రస్టు సభ్యులు ఆతనికి కావాల్సిన తిరుబండారాలతో పాటుగా చిన్న పాటి దుకాణానికి కావాల్సిన వస్తువులను కూడా సమకూర్చారు. నగరానికి వలసపోయే ఆలోచనను మానుకున్న రామన్న తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చిరు సహాయం చేసి తమ పని అయిపోయందనుకోకుండా మరోవారానికి తిరిగి అదే గ్రామానికి వచ్చిన ట్రస్టు సభ్యులు వ్యాపారం గురించి ఆరాతీశారు. తినుబండారాలతో పాటుగా కిరణా సామాన్లు రామన్నకు అందాయి. అతని వ్యాపారం రెట్టింపయింది. వేసవిలో ప్రజల దాహం తీర్చడానికి అతని దుకాణంలోకి ఫ్రిడ్జ్ వచ్చిచేరింది. వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది. అంతనితో ఆగని రామన్న అల్పాహారాన్ని కూడా ఉంచడం ప్రారంభించాడు. దీనికి కావాల్సిన సరుకులతో పాటుగా సరంజామా అంతా కూడా ట్రస్ట్ సమకూర్చింది.
ఇప్పుడు బొమ్మిశెట్టి సుబ్బరామన్న దశతిరిగిపోయింది. ఒకప్పుడు గ్రామం వదిలి పట్టణంలో కూలీనాలీ చేసుకుని బ్రతుకుదామనుకున్న ఆయన తన స్వంత గ్రామంలోనే తనకాళ్లపై తాను నిలబడే పరిస్థితికి చేరుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్నడు. రోజుకు 2వేల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతోంది. ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ సహాయం వల్లే తాను ఈ స్థితికి చేరుకున్నానని చెప్తున్న ఆయన తనవంతుగా ట్రస్టుకు సహాయం చేయాలని ముందుకు వచ్చాడు. తాను ఏవిధంగా సహాయం చేయగలలని అడిగిన బొమ్మిశెట్టి సుబ్బరామన్న కు మీకన్నా పేదవారిని ఆదుకోవడం ద్వారా మరొకరికిగా దారిచూపాలనే సమాధానం వచ్చింది.
నిజంగా రామన్న దశ మారిపోవడానికి కారణం ఏమిటి? ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ సహకారామేనా అంటే పూర్తిగా కానేకాదు. అతని రెక్కల కష్టానికి ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ తోడ్పాటును అందించింది. ఇది ఒక్క బొమ్మిశెట్టి సుబ్బరామన్న విషయంలోనే కాదు ఇంకా అనేక వేల మంది జీవితాల్లో ఇటువంటి అద్భుతాలే జరిగాయి. తనకు సహాయం కావాలంటూ ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ ను తనంతట తానుగా రామన్న కలవలేదు… వారు ఎవరో కూడా అతనికి తెలియదు. మరి ‘’ శ్రీ రామునుజ మిషన్ ట్రష్ట్ ‘’ ప్రతినిధులను బొమ్మిశెట్టి సుబ్బరామన్న దగ్గరకు పంపిందెవరు?… ….
ramanuja mission trust,

Wanna Share it with loved ones?