రాజకీయ రంగు పులుపుకున్న రమణ దీక్షితులు వ్యవహారం

0
102
తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
Ramana Dikshitulu, tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడి బలవంతపు పదవీ విరమణ అంశంపై రాజకీయ దుమారం రేగుతోంది. తిరుమల దేవస్థానంలో అనాచారాలు జరుుతున్నాయని, సంప్రదాయాలను పక్కనుపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వీఐపీల సేవలో తరిస్తుండడంతో పాటుగా దేవాలయం సంప్రదాయాలను పక్కన పెట్టిందని చెన్నేలో జరిగిన విలేకర్ల సమావేశంలో రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై ప్రభుత్వం అదే స్థాయిలో ప్రతిస్పందించింది. తిరుమలలో సమావేశమైన టీటీడీ బోర్డు వెంటనే 65 సంవత్సరాల పదవీవిరమణ వ అంశాన్ని తెరపైకి తీసుకునివచ్చి ఆయన్ని ఆలయ ప్రధానార్చకుడి పదవినుండి తప్పించడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. తిరుమలలో అనాచారాలు జరుుతున్నాయని బయటిప్రపంచానికి చెప్పిన వెంటనే పదవీ విరమణకు సంబందించిన అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చి ఆయన్ను పదవి నుండి తప్పించడం వివాదాస్పదమైంది.
రమణ దీక్షితులు ను ప్రభుత్వం వేధిస్తోందని ఈ వ్యవహారంలో ఆయనపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం తాము రమణదీక్షితులపై ఎటువంటి కక్షసాధించు చర్యలకు పూనుకోవడం లేదని, పదవీవిరమణ నుండి తప్పించుకునేందుకే ఆలయ ప్రధాన అర్చకుడు బోర్డు సమావేశానికి ఒకరోజు ముందు ప్రెస్ మీట్ పెట్టి మరీ రాద్దాంతం చేశారని అంటున్నారు.
రాజకీయ కారణాల వల్లే రమణ దీక్షితులు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనేది వారి వాదన. రమణదీక్షితులు చెప్తున్న అంశాలు ఏవీ తాజాగా తీసుకున్న నిర్ణయాలు కాదని చాలా కాలం నుండి అవి అమలవుతున్నాయని ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడే వాటిపై ఎందుకు మాట్లాడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇటు రమణ దీక్షితులను సమర్థిస్తున్నవారు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వేల సంవత్సరాలుగా వస్తున్న అచారాలను పక్కనపెట్టడంతో పాటుగా వాటిని గురించి ప్రశ్నించిన వారిపై చర్యలు తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి నగలకు, అచారాలకు సబంధించిన తమ వివరణను ఇవ్వాల్సిందిపోయి నిజాలను వెల్లడించిన వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సబబని వారంటున్నారు.
రమణదీక్షితులు లపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చేస్తున్న ఆరోపణలు దారుణమని చిన్న చిన్న విషయాలను బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని వారు చేస్తున్న ఆరోపణల్లో అసలు వాస్తవాలు ఏవీలేంటున్నారు. తిరుమల శ్రీనివాసుడి ఆలయం ప్రధాన అర్చకుడిని ఉన్న ఫళాన పక్కనపెట్టం ఎంతమాత్రం సరికాదనేది వారి వాదన
మరో వైపు తనను ప్రధాన ఆచార్యుడి పదవి నుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై రమణదీక్షితులు న్యాయపోరాటం చేస్తానంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పాలకమండిలి నిర్ణయం తీసుకుందని ఆయన చెప్తున్నారు. టీడీపీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను కోర్టులో సవాలు చేస్తానంటున్న ఆయన తిరుమల దేవాలయంలో అనాచారాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు. దేవాలయంలోని పోటును మూసివేడం దగ్గర నుండి వివిధ సేవలకు సంబంధించిన సమయాలు మార్చడం దాకా పూర్తిగా ఆగమన శాస్త్రానికి విరుద్దంగా టీటీడీ ప్రవర్తింస్తోందని ఆయన పేర్కొన్నారు.
తిరుమల ఆలయ చరిత్రతో పాటుగా ఆగమన శాస్త్రాలపై కనీస అవగాహన లేనివారు పాలకులుగా పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన అంటున్నారు. కోట్లాది మందికి ఇలవేల్పయిన శ్రీనివాసుడి కైంకర్యాలలో జరుగుతున్న దోషాలను సవరించాలనేది రమణదీక్షితులు డిమాండ్. వీటిపై కూడా కోర్టులో పోరాడతానని అంటున్నారు.
tirumala, tirumala tirupathi, tirupathi, balaji, sri venkateshwara swami, srinivasudu, tirumala srinivasudu, tirumala balaji temple, ttd,Ramana Dikshitulu.

52వేల ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేసిన టిటిడి


హైదరాబాద్ లో భారీ వర్షం
Tirumala

Wanna Share it with loved ones?