రాంమాధవ్ తల్లి జానకీ దేవి అంత్యక్రియలు పూర్తి

అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ తల్లి వారణాసి జానకీ దేవి అంత్యక్రియలు బన్సీలాల్ పేట శ్మశానవాటికలో జరిగాయి. బీజేపీ,ఆర్ఎస్ఎస్ లకు చెందిన జాతీయనేతలతో పాటుగా స్థానిక నేతలు,కార్యకర్తలు అంత్యక్రియలకు హాజరయ్యారు. నేరేడ్ మెట్ కాకాతీయ నగర్ లోని రాంమాధవ్ ఇంటికి పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు తరలివచ్చి జానకీదేవి భౌతికకాయానికి శ్రద్దాంజలి ఘటించారు.
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రే, ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు, జమ్ముకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు లతో పాటుగా పెద్ద సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకులు జానకీదేవి భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల గవర్నర్ ఇఎల్ నరసింహన్ రాం మాధవ్ నివాసానికి వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు.
రాంమాధవ్ లాంటి నేతను జాతికి అందించిన జానకీదేవి మృతిపట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. మే 27వ తేదీన వైకుంఠ సమారాధన కార్యక్రమం జరుగుతుందని రాం మాధవ్ కుటుంబానికి సన్నిహితుడు, లఘు ఉద్యోగ్ భారతి తెలంగాణ కార్యదర్శి సుధాకర్ శర్మ తెలిపారు.
ram madhav, bharatiya janatha party, bjp, rss, rss leader, bjp national general secretary.

రాజకీయ రంగు పులుపుకున్న రమణ దీక్షితులు వ్యవహారం


హైడ్రామా ల మధ్య కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం