రాంచరణ్ రంగస్థలంపై రగడ

రామ్ చరణ్, సమంతా జంటగా నటించిన “రంగస్థలం” చిత్రం విడుదలకు సిద్దమైంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలోని ఒక పాట పట్ల యాదవ సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ సామాజిక వర్గంలోని మహిళలను కించపర్చేవిగా ఉన్న సినిమాలోని పాటలోని ఒక పదాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాదవ కులస్తులను కించపర్చేదిగా ఉన్న పాటలోని పదాన్ని తీయకపోతే ఆందోళన చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలో గొల్ల భామ అనే మాటను వాడారని అది తమకు అభ్యంతరకరంగా ఉందని వారు చెప్తున్నారు. అయితే ఈ పాటను రాసిన రచయిత మాత్రం తాను ఎవరినీ కించపర్చే ఉద్దేశంతో ఆ పాటను రాయలేదని గొల్లభామ అనే కీటకాన్ని గురించి మాత్రమే రాశానని చెప్తున్నాడు.
మరోవైపు సినిమా విడుదలకు సిద్ధమైన సమయంలో పాటను గురించి వివాదం లేవనెత్తడం సరికాదని సినీరంగానికి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ వరంగల్ వాసు తెలంగాణ హెడ్ లైన్స్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సినిమా విడుదలకు చాలా రోజుల ముందే ఆడియో విడుదల అవుతుందని పాటలపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా వాటిపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెప్పారు. బోర్డుకు ఫిర్యాదు చేస్తే దానిపై వారు తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. సినిమా పాటులు విడుదలయి చాలారోజులు అయిందని ఇప్పుడు సినిమా విడుదలకు ముందు పాటలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసంకాదన్నారు. సినిమా పాటను గురించికానీ అందులో వాడిన పదాలపై కానీ తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయడంలేదని అవి సరైందా కాదా అన్న విషయాన్ని పక్కనపెడితే సినిమా ఆడియో విడుదల అయిన వెంటనే ఫిర్యాదు చేయడం లేదా అభ్యంతరం వ్యక్తం చేయడం కానీ చేయాలని తీరా సినిమా విడుదలకు ముందు వివాదాన్ని రేపడం సరికాదన్నారు. సినిమాపై కొన్ని వేలమంది ఆధారపడి బతుకుతున్నారని చెప్పిన ఆయన సినిమా విడుదల నిల్చిపోతే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
ram charan, ram charan ranastalam, rangastlam movie,yadava sena, yadav, yadavs,telugu, telugu movie, telugu movies.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *