రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం

0
67
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించారు. అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో అధికార పక్షం అభ్యర్థి సునాయాసంగా గెలిచారు. ఎన్డీయే తరపున
జేడీయు నేత హరివంశ్నారాయణ్ సింగ్ పోటీ చేయగా విపక్షల తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన హరిప్రసాద్ పోటీ చేశారు. అధికారపక్షానికి 125 ఓట్లు రాగా విపక్షానికి 105 ఓట్లు మాత్రమే దక్కాయి. దీనితో కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సీనియర్ పాత్రికేయుడైన హరివంశ్ రాజ్యసభకు ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతు కోసం జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరడంతో టీఆర్ఎస్ ఆ పార్టీకి చెందిన ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బీజేపీ-కాంగ్రెస్ లకు సమానదూరం పాటిస్తున్నప్పటికీ తెలంగాణ ఉధ్యమసమయంలో జేడీయూ నేత నితీష్ కుమార్ తెలంగాణ గట్టిగా మద్దతు పకలడంతో పాటుగా జేడీయూ నేతతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపధ్యంలో అధికార కూటమికి టీఆర్ఎస్ మద్దతు పలికింది. అటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసింది. గత కొద్దికాలంగా బీజేపీతో తీవ్రంగా విభేదిస్తున్న టీడీపీ విపక్షల ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేయగా వైెఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఎవరికీ ఓటు వేయకుండా సభ నుండి గైర్హాజరయ్యారు.
ప్రస్తుతం రాజ్యసభలో 244 మంది సభ్యులు ఉన్నారు. ఓటింగ్ లో మాత్రం 230 మంది మాత్రమే పాల్గొన్నారు. వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు, డీఎంకే కు చెందిన ఇద్దరు సభ్యులు, తృణముల్ కాంగ్రెస్ కు చెందిన ఒకరు. మొత్తం 14 మంది రాజ్యసభ డిప్యూట్ ఛైర్మన్ పదవికి జరిగిన పోటీలో ఓటువేయలేదు. 230 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించకున్నా కనీసం 110 ఓట్లను సాధించాలనుకున్న విపక్షాల ఆశలు అడియాశలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో పాటుగా తమకు అనుకూలంగా ఓటు వేస్తారనుకున్న డీఎంకే,వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉండడంతో విపక్షాలు ఆశించినన్ని ఓట్లను దక్కించుకోలేకోయింది.
సార్వత్రికి ఎన్నికలకు నెలలు మాత్రమే గడువున్న నేపధ్యంలో విపక్షాల ఐక్యతను ప్రదర్శించడం ద్వారా అధికార కూటమిపై ఒత్తిడి తేయాలనుకున్న కాంగ్రెస్ ఆశలు ఫలించలేదు. బీజేపీ వ్యూహాత్మకంగా తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా కూటమిలోని జేడీయు అభ్యర్థితి మద్దతు పలకడం ద్వారా ఇటు టీఆర్ఎస్ తో పాటుగా తటస్థ పార్టీల మద్దతు పొందగలిగింది. జేడీయూ అభ్యర్థి నిర్ణయంపై తొలుత శివసేన అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ తర్వాత హరివంశ్‌కు మద్దతిస్తామని ప్రకటించింది. అధికార పక్షం అభ్యర్థి విజయం కోసం ప్రధాని నరేంద్రమోడీతో పాటుగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వివిధ పార్టీలతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. వారి వ్యూహాలు ఫలించి అధికార ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ సునాయాసంగా విజయం సాధించారు.
ఇటు విపక్షాల తరపున తృణముల్ కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన అభ్యర్థిని నెలబెట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఆఖరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థి హరిప్రసాద్‌ను రంగంలోకి దించింది.
Harivansh Narayan Singh, Janata Dal United, BK Hariprasad, NDA candidate, Arvind Kejriwal, YSR Congress, Trinamool Congress, DMK, Left parties, Samajwadi Party, Bahujan Samaj Party and Nationalist Congress Party, Chandrababu Naidu, Telugu Desam Party.

కరుణానిధి అంత్యక్రియలు పూర్తి


వీసా గడువు ముగిసినా అమెరికాలోనే
Rajya_Sabha

Wanna Share it with loved ones?