సంచలన కేసులో స్వాతి ప్రియుడి అరెస్ట్

0
38

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నాగర్ కర్నూల్ హత్యకేసులో నిందితుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ప్రియురాలి భర్తను అత్యంత దారుణంగా హత్య చేయడంతో పాటుగా తానే ప్రియురాలి భర్తగా నమ్మించేందుకు మొహంపై కాల్చుకుని హాస్పిటల్ లో చేరిన రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ కు చెందిన స్వాతికి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి ఇద్దురు పిల్లలు కూడా ఉన్నారు. స్వాతికి రాజేష్ తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. దీనితో భర్తను అడ్డు తప్పించడానికి పన్నాగం పన్నిన స్వాతి ప్రియుడి సహాయంతో అతన్ని దారుణంగా హత్య చేసింది. తాము చేసిన హత్య ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన వీరు రాజేష్ నే సుధాకర్ రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు. రాజేష్ తనకు తానుగా ముఖాన్ని కాల్చుకుని ఆస్పత్రిలో చేరాడు. తన భర్త సుధాకర్ రెడ్డే ఆస్పత్రిలో చేరాడంటూ స్వాతి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కాలిన గాయలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని సుధాకర్ రెడ్డిగానే చలామణి అవుదామని వీరిద్దరు పన్నాగం పన్నారు.
కాలిన గాయాలతో కంచన్ బాగ్ లోని అపోలో ఆస్పత్రిలో సుధాకర్ రెడ్డ పేరుతో ఆస్పత్రిలో చేరిన రాజేష్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సుధాకర్ రెడ్డి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య వ్యవహారం బయటకు వచ్చింది. ఇప్పటికే స్వాతిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు రాజేష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.Wanna Share it with loved ones?