రాజాసింగ్ ను అడ్డుకునేందుకు భారీ కసరత్తు

గోషామహల్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా అధికార టీఆర్ఎస్ తో పాటుగా మజ్లీస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కార్పోరేటర్ గా ఉన్న రాజాసింగ్ అటు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజాసింగ్ కు పార్టీతో పెద్దగా సంబంధాలు కనిపించవు. పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నా ఆయన హైదరాబాద్ లో వ్యక్తిగతంగా తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నాడు. హైదరాబాద్ లో అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్న వారిలో రాజాసింగ్ మొదటి స్థానంలో ఉన్నారని అందుకోసం గాను ఆయన్ను ఓడించేందుకు అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్ కూడా హింధూ అతివాద నేతగా పేరుగాంచి రాజా సింగ్ ను ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. అయితే గోషామహల్ నియోజకవర్గంలో తమకు అంత బలం లేకపోవడంతో మిత్రపక్షం టీఆర్ఎస్ సహాయం తీసుకుని రాజాసింగ్ కు చెక్ పెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ బరిలోకి దింపించేందుకు మజ్లీస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ చేరిన దానం ఖైరతాబాద్ సీటును ఆశించినప్పటికీ మిత్రుల కోరిక మేరకు ఆయన్ను గోషామహల్ నుండే పోటీకి దింపడానికే గులాబీ పార్టీ ఆశక్తి చూపుతోంది. గోషామహల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలపై దానంకు గట్టిపట్టుంది. గతంలో ఆయన ప్రాతినిధ్యంవహించిన ఆసీఫ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలు గోషామహల్ లో కలిశాయి.
తమ పార్టీ తరపున గట్టి అభ్యర్థిని నిలపడం ద్వారా రాజా సింగ్ ను ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అక్కడి నుండి దానం నాగేందర్ ను బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ముకేష్ గౌడ్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండడంతో గోషామహల్ లో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగితే రాజాసింగ్ ను నిలువరించడం ఖాయమనే అభిప్రాయం టీఆర్ఎస్ లో కనిపిస్తోంది. అటు మజ్లీస్ కూడా ఆయన్ను ను అడ్డుకునేందుకు గాను తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలపకుండా దానంకు మద్దతు ప్రకటించడం గానీ లేదా బలహీన అభ్యర్థిని పెట్టడం ద్వారా పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరిస్తుందనే ప్రచారం జరుగుతోంది.
పాతనగరంలో ఈ అతివాద నేత తమ కంటిలో నలుసుగా మారాడని మజ్లీస్ భావిస్తోంది. అందుకోసం గాను అందుబాటులో అన్ని ప్రయత్నాలు చేసి ఆయన తిరిగి ఎన్నికవకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అక్రమ కేసులు పెడుతున్నారు:రాజాసింగ్
మజ్లీస్ పార్టీ కోరిక మేరకే తెలంగాణ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు. ఆగస్టు 15వ తేదీన తిరంగా ర్యాలీ పేరుతో అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారంటూ ఆయనతో తో పాటుగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. తనను ఇబ్బందుల పాలు చేసేందుకే టీఆర్ఎస్ అధికారులపై ఒత్తిడి తీసుకుని వచ్చి తమపై కేసులు పెట్టారని ఆయన అంటున్నారు. నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడానికి ఇదే కారణమని ఆయన అంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు.
raja singh, goshamahal, goshamahal mla, goshamahal mla raja singh, raja singh, bjp, old city, aimim, mim, hyderabad old city, danam nagender, mukesh goud.

Troubling worms in little tummy