సినిమా ధియేటర్లపై అధికారుల దాడులు

0
61
సినిమా హాళ్లపై దాడులు

raids on cinema theatres .. నగరంలోని సినిమా హాళ్లలో తినుబంఢారాలను ఎమ్మార్పీ రేట్లకే అమ్మాలంటూ ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ వాటి అమలు తీరును పరిశీలించింది. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న సినిమా హాళ్లపై 20కి పైగా కేసులను నమోదు చేశారు. ప్రతీ దానిపైనా ఎమ్మార్పీ రేటును ఖచ్చితంగా ముద్రించాలని దానితో పాటుగా ఆహార పదార్థాలు లేదా ద్రవ పదార్థాల పరిణామానికి సంబంధించిన వివరాలను తూనికలు, కొలతల శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిగి గుర్తించి కేసులను నమోదు చేశారు.
నగరంలోని ప్రసాద్ మల్టిపెక్స్, సుజనామాల్, బిగ్ సినిమా, ఏషియన్ సినిమా, పీవీఆర్ సినిమాస్ లలో అధికారులు తనిఖీలు జరిపారు. అన్ని చోట్లా కొలతలు సరిగా లేకపోవడంతో వారిపై కేసులను నమోదు చేశారు. ముఖ్యంగా పాప్ కార్న్ లాంటి పదార్థాలు, కాఫీలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ముద్రించిన పరిణామానికి, వాస్తవ పరిణామానికి తేడా ఉందని అధికారుల తనిఖీలో తేలింది.
ప్రస్తుత తమ తనిఖీల్లో ఎమ్మార్పీ ధరలకు అమ్ముతున్నారా లేదా అన్నదానిపైనే తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వారు స్పష్టం చేశారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని అయితే ఎమ్మర్పీని నిర్ణయించుకునే అధికారం అమ్మకందారులకు ఉందని స్పష్టం చేశారు. వస్తువుల నాణ్యత, ఎమ్మర్పీ ధరల నిర్ణయం తమ పరిధిలోకి రాదని వారు చెప్పారు. తమ సొంత బ్రాండ్లపై ధియేటర్ల యాజమాన్యాలు అమ్మకాలు సాగించుకోవచ్చని అన్నారు. అయితే కేవలం ఒకటే బ్రాండ్ కాకుండా మార్కెట్ రెండు మూడు బ్రాండ్లను ప్రజలకు అందుాటులో ఉంచాలని తూనికలు, కొలతల శాఖ అధికారలు చెప్తున్నారు.
ఆగస్టు ఒకటవ తేదీ నుండి నగరంలోని అన్ని ధియేటర్లలో ఎమ్మర్పీ ధరల కన్నా ఎక్కువ ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని అధిరాలు ప్రకటించారు. దీనిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ధియేటర్ల యజమానులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. నిబంధనలను పట్టించుకోకుండా యాదేఛ్చగా ఎక్కువ ధరలకు విక్రయిస్తునే ఉన్నారు. తూనికలు కొలతల శాఖాధికారుల దాడుల్లో ఈ విషయం తేటతెల్లం అయింది. అనేక చోట్ల నిబంధనలకు పాతరేసి ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు విక్రయించడంతో పాటుగా కొలతల్లో తేడాలను గుర్తించారు.
సినిమా ధియేటర్లలో ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్న తినుభండారాల ధరల విషయంలో ప్రభుత్వ చర్యలను ప్రేక్షకులు హర్షిస్తున్నారు. అయితే సినిమా ధియేటర్ల యాజమాన్యం తమ ఇష్టానుసారంగా రేట్లను నిర్ణయించే పద్దతికి కూడా చరమగీతం పాడాలని కోరుతున్నారు. దీనితో పాటుగా ప్రజలు బయటి నుండి తినుబంఢారాలను ధియేటర్లలోకి తీసుకుని వెళ్ళే అవకాశం కల్పించాలని దీని వల్ల ధియేటర్ల లోపల ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రేక్షకులు అంటున్నారు.
నిబంధనలకు కఠినంగా అమలు చేయాలని ఇదే తరహా దాడులను నిరంతరం కొనసాగించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
food rates in cinema halls, akun sabharwal, hyderabad, hyderabad cinema halls, cinema, prasad i max, pvr cinema, sujana mall, asian cinema.raids on cinema theatres.

ప్రభుత్వ ఉద్యోగాలు | government jobs


గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…
India

Wanna Share it with loved ones?