రాహుల్ మోడిని ఎందుకు కౌగిలించుకున్నాడు | rahulgandhi in parliament

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పై జరుగుతున్న చర్చ సందర్భంగా కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తరువాత విపక్షనేత రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వచ్చి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. దీని తరువాత రాహుల్ కన్ను కొట్టిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలతో పాటుగా దేశంలోని వార్తా ఛానళ్లకు హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ గాంధీ ప్రధానిని ఆలింగనం చేసుకోవడం ఆ తరువాత కన్ను కొట్టడంపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అయితే అసలు రాహుల్ ప్రధానిని ఎందుకు ఆలింగినం చేసుకున్నట్టు…
అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగానే ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు నుండి జీఎస్టీ వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యులు ఎట్లా నష్టపోయింది వివరించారు. దీనితో పాటుగా ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతోందని పేర్కొంటూ రఫాల్ యుద్ధవిమానాల విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత తన ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్ బీజేపీ ప్రభుత్వంలో ఎవరీ భద్రత కొరవడిందని, అభద్రతాభావం పెరిగిందని, ఆహసహనం ఎక్కువయిందని వ్యాఖ్యానించారు.
తనపై చేస్తున్న విమర్శలపై కూడా స్పందించిన రాహుల్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు తాను రుణపడిఉంటానని అసలైన హింధువు అనే పదానికి నిజమైన అర్థం వారి వల్లే తనకు తెలిందని చెప్పారు. వాళ్లు ప్రజల మధ్య అఘాతాన్ని సృష్టిస్తే తాము మాత్రం ప్రజల మధ్య సోదర భావాన్ని పెంచుతామని అంటూ తనను ‘పప్పు’ అంటూ ఎగతాళిచేయడం పై కూడా స్పందించారు. తనను పప్పుగా ఎగతాళి చేసినా తనకు ప్రధానిపై గౌరవం ఉందని చెప్తూ నేరుగా ప్రధాని నరేంద్ర మోడి వద్దకు వెళ్లారు. ఆయన్ను గట్టిగా ఆలింగనం చేసుకోవడంతో మోడీతో సహా సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి ఒక్క క్షణం బిత్తరపోయిన ప్రధాని వెంటనే తేరుకున్నారు. తనని ఆలింగనం చేసుకుని వెనక్కి వెళ్తున్న రాహుల్ ని వెనక్కి పిల్చి ఆయన బుజం పై తట్టారు. తిరిగి తన స్థానం వద్దకు వచ్చిన తరువాత రాహుల్ మాట్లాడుతూ హింధు అంటే ఉద్దేశం ఇదీ అంటూ చెప్పడం పై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలను పాటించాలంటూ సూచించారు.
తన స్థానంలో కూర్చున్న తరువాత సహచర సభ్యుడు ఏదో అనడంతో కన్నుకొట్టడం కూడా హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ చర్యలపై కొంత మంది కామెంట్లు చేస్తుండగా మరికొందరు మాత్రం రాహుల్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడని అంటున్నారు. బీజేపీ వల్ల దేశంలో అసహనం పెరుగుతోందంటూ దుమారం రేగుతున్న సమయంలో స్వయంగా రాహుల్ ప్రధాని వద్దకు వెళ్లి తమ పార్టీ కానీ తాను కానీ అసహనం వ్యక్తం చేసే తరహా కాదని చెప్తూ ప్రధానిని ఆలింగినం చేసుకోవడం రాహుల్ గాంధీ కి ప్లస్ అవుతుందని అంటున్నారు.
rahulgandhi in parliament , rahul gandhi, rahul , parliment, congress party, aicc, rahul gandhi , congress president rahulgandhi.

government-jobs
rahul gandhi