కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సీతాపూర్ లో జరిగిన ఎన్నికల ప్రసార సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ మోడీ పై మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు మోడీకి పట్టవని ఆయన అన్నారు. ప్రజల కష్టాల గురించి పట్టించుకోకుండా నరేంద్ర మోడీ తనకు నచ్చినట్టు చేసుకుని పోతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు మోడీ ఎన్నో వాగ్దానాలు చేశారని అవి ఏమయ్యాయని రాహుల్ ప్రశ్నించారు. విదేశాల నుండి నల్ల ధనాన్ని వెనక్కి తీసుకుని వస్తానని చెప్పిన మోడీ ఇప్పుడు ఆ సంగతి పట్టించుకోవడమే మానేశారని ఆరోపించారు.
ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పడం ఆ తరువాత వాటిని పట్టించుకోకుండా కొత్త అబద్దాలు చెప్పడం మోడీకి అలవాటు గా మారిందని రాహుల్ దుయ్యబట్టారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా మోడీ చాలా హామీలు ఇస్తున్నారని అయితే ఎన్నికల తరువాత వాటిని మర్చిపోవడం ఖాయమని రాహుల్ అన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఉత్తర్ ప్రదేశ్ ను ఉత్తమ్ ప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని రాహుల్ హామీ ఇచ్చారు. తాము తీర్చగలగే హామీలను మాత్రమే ఇస్తున్నామని మోడీగాలే అరచేతిలో స్వర్గాన్ని చూపించడం లేదన్నారు.