కాంగ్రెస్ నేతతో మోడికి క్షమాపణలు చెప్పించిన రాహుల్

0
69
New Delhi: Congress Vice President Rahul Gandhi during a press conference at Parliament in New Delhi on Wednesday. PTI Photo by Subhav Shukla (PTI12_14_2016_000052B)

కాంగ్రెస్ నేత తో ప్రధాని మోడికి క్షమాపణలు చెప్పించారు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇటీవల ప్రధానిపై మణిశంకర్ అయ్యర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని అటువంటి పార్టీలోని వ్యక్తి వాడాల్సిన భాష హుందాగా ఉండాలని రాహుల్ పేర్కొన్నారు. ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యాలను ఏ మాత్రం సహించేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో వెంటనే మణిశంకర్ అయ్యర్ ప్రధానికి క్షమాపణలు చెప్పారు. తాను ఆ విధంగా వ్యాఖ్యానించాల్సి కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడిని ” నీచ్ ఆద్మీ” గా మణిశంకర్ అయ్యర్ సంభోదించారు.
మణిశంకర్ అయ్యర్ చేసిన కామెట్లపై ప్రదాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆయన తనని మాత్రమే అవమానించలేదని గుజరాత్ రాష్ట్రాన్ని అవమానించాడని వ్యాఖ్యానించారు. గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ తనను కాంగ్రెస్ నాయుకులు ఇబ్బందులు పెట్టారని అన్నారు. నాడు తనను జైలుకు పంపేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని నరేంద్ర మోడి అన్నారు.Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here