లండన్ లో రాహుల్ కు అరుదైన గౌరవం

0
61
rahul gandhi in london

rahul gandhi in london యూరప్ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఆ దేశ రాజధాని లండన్ లో రాహుల్ కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ పార్లమెంటు గ్రాండ్ కమిటీ రూంలో ప్రసంగించిన తొలి విదేశీ విపక్ష నేత రాహుల్ గాంధీనేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఈ హాల్ లో ప్రసంగించిన విదేశీ ప్రముఖుల్లో నెల్సన్ మండేలా, మిఖైల్ గోర్బచెవ్, దలైలామా లాంటి నేతలున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో విరుచుకుని పడ్డారు. జర్మనీ నుండి ఇంగ్లాండ్ కు వచ్చిన ఆయన పలుచోట్ల ప్రసంగించారు.మోడీ సర్కారు విదేశాంగ విధానంపై రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విరుచుకుని పడ్డారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు.
చైనాతో డోక్లాంలో జరిగిన పరిణామాలను గురించి మాట్లాడిన రాహుల్ ఆ ప్రాంతంలో ఇంకా చైనా బలగాలు ఉన్నాయని డోక్లాం అంశాన్ని తమకు అనుకూలంగా మోడీ సర్కారు మార్చుకునే ప్రయత్నం చేస్తోందని అయితే వాస్తవానికి ఈ అంశంలో భారత విదేశాంగ విధానంలోని లోపాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఇరు దేశాలకు చెందిన సైనికులు దాదాపు 70 రోజులు ఎదురుబొదురుగా వచ్చాయని ఇది నివారించగల్గిన అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. డోక్లాం విషయంలో తాము పెద్ద విజయం సాధించినట్టుగా మోడీ సర్కారు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ఇది ఒక్కటే కాదని చైనాపై అనుసరిస్తున్న విధానంలో అనేక లొసుగులు ఉన్నాయన్నారు. డోక్లాం ఒకటే కాదని ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయని రాహుల్ గాంధీ చెప్పారు.
పాకిస్థాన్ విషయంలో ఎటువంటి వ్యూహాం అనుసరించానే అంశంపై బీజేపీ సర్కారుకు సరైన అవగాహన లేదన్నారు. హఠాత్తుగా పాకిస్థాన్ కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ పర్యటన వల్ల ఎటువంటి లాభం పొందారో దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచదేశాలను చుట్టిరావడం తప్పిస్తే భారత్ కు మోడీ హయాంలో స్పష్టమైన విదేశంగా విధానం లేకుండాపోయిందన్నారు. మోడీ ఎవరి సలహాలను తీసుకోవడం లేదని మొండిగా వ్యవహరస్తూ నియంత పోకడలకు పోతున్నారని రాహుల్ దుయ్యబట్టారు. విదేశం మంత్రి సుష్మాస్వరాజ్ కు పనిలేకుండా పోయిందని కేవలం వీసాలు ఇప్పించడంలోనే ఆమె బిజీగా కాలం గడుపుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. విదేశాంగ మంత్రికి కూడా తెలియకుండానే నిర్ణయాలు జరిగిపిపోతున్నాయని ప్రదాని ఆదేశాలతో ఆయన కార్యాలయం మంత్రులను సైతం పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ బీజేపీ ప్రభుత్వం పైనా ముఖ్యమంగా ప్రధాని నరేంద్ర మోడీపైనా నిప్పులు చెరుగుతున్నారు. మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని కొన్ని వర్గాల వారిని పూర్తిగా అణచివేస్తున్నారంటూ జర్మనీలో మండిపడ్డ రాహుల్ గాంధీ ఇప్పుడు బ్రిటన్ పర్యటనలోనూ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడుతున్నారు. జర్మనీలో మోడీ ప్రభుత్వ దేశీయ వైఫల్యాలను ఎత్తిచూపిన రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో విదేశాంగ విధానంలోని లోపాలపై విమర్శల వర్షం కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించడంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలం అయిందని రాహుల్ ఆరోపించారు.

వాజ్ పేయి సంస్మరణ సభలో ఏంటానవ్వులు


ఉత్తమ ప్రధాని మోడీనే-రెండో స్థానంలో ఇందిరాగాంధీ

Wanna Share it with loved ones?