రాహుల్ రాజ్యాన్ని ఏలతాడా…?

0
66

యువరాజు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారయ్యింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఖాయం. రాహుల్ పై పోటీ చేసే నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరన్నది అందరికీ తెలిసిందే…కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేపట్టబోతున్నారు. కాలం కలిసి వస్తే మరోసారి దేశాన్ని ఏలాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపే సత్తా యువనేతకే ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నెహ్రు కుటుంబాన్ని కాదని వేరే వారికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించే సాహసం చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు.
దేశ రాజకీయాలను నెహ్రు కుటుంబాన్ని వేరువేరుగా చూడలేం. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఎక్కువ కాలం ఆ కుటుంబంమే దేశాన్ని ఏలింది. రాహుల్ ముత్తాత నెహ్రు, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ లు దేశ ప్రధానులుగా పనిచేస్తే తల్లి సోనియా ప్రత్యక్షంగా ప్రధానమంత్రి పదవిని చేపట్టకున్న తెరవెనుక చక్రం తిప్పారు.ఇప్పుడు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారీ అంచానాలను తలకిందులు చేస్తూ తిరిగిలేవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే… ఇందిరాగాంధీ హయం నుండి తాజాగా సోనియా గాంధీ జమానా వరకు ఇవే పరిస్థితులు. అయితే గతంలో కన్నా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. బీజేపీ బలీయమైన స్థాయిలో ఉంది. దేశానికి తిరుగులేని నేత నరేంద్ర మోడి ఎదిగారు. కేంద్రంతో పాటుగా రాష్ట్రాల్లోనూ బీజేపీ తిరుగులేని ఆదిపత్యాన్ని చలాయిస్తోంది. ఈ పరిస్థితుల్లో మోడీని ఎదుర్కొనే సత్తా రాహుల్ కు ఉందా అనేది ప్రశ్నార్థకమే…
సామాజిక మాధ్యమాల్లో రాహుల్ పై ఎన్ని జోకులు ప్రచారంలో ఉన్నా… రాహుల్ ను ముద్దపప్పుగా చూపించే ప్రయత్నాలు చేసినా అతనికి ఉన్న ఛరిష్మా సామాన్యమైనదేమీ కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బూత్ స్థాయి కార్యకర్తలు ఉన్న ఏకైమ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఈ స్థాయి కార్యకర్తల బలం బీజేపీ కి కూడా లేదు.
దేశంలోని కోట్లాది మంది కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు ఇప్పుడు రాహుల్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సీరియస్ రాజకీయవేత్తగా కనిపింకపోవడం ఆయనకు పెద్ద మైనస్ అని రాజకీయ విమర్శకులు అంటుంటారు. ఈ బలహీనతలను తట్టుకుని కాంగ్రెస్ కు పూర్వటి వైభవాన్ని రాహుల్ తీసికుని రాగరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే…

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here